జగన్ మినహా వైసిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్, ఆదినారాయణ పేరు చెప్పి..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను శాసన సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సభకు అంతరాయం కలిగిస్తున్నారంటూ మంత్రి యనమల రామకృష్ణుడు సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారు. దానిని స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆమోదించారు. జగన్ మినహా వైసిపి సభ్యులు సస్పెండ్ అయ్యారు.
మంత్రి యనమల వైసిపి సభ్యుల పేర్లు చదువుతు.. ఇటీవల టిడిపిలో చేరిన ఆదినారాయణ రెడ్డి పేరును కూడా చెప్పారు. ఆ తర్వాత మొదటి పేరు (ఆదినారాయణ) తప్పు మిగతా వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిని ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు.

వైసిపి సభ్యులు... గిడ్డి ఈశ్వరి, గోవర్ధన్ రెడ్డి, జయరాం, జోగులు, కళావతి, కల్పన, ఎస్వీ మోహన్ రెడ్డి, షేక్ మహ్మద్ ముస్తఫా, ముత్యాల నాయుడు, నారాయణ స్వామి, జ్యోతుల నెహ్రూ, పుష్ప శ్రీవాణి, రఘుపతి, రఘురామి రెడ్డి, రాజన్న దొర, రాజేంద్రనాథ్, రాజేశ్వరి, రామచంద్రా రెడ్డి, రామకృష్ణా రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, సర్వేశ్వర రావు, శివప్రసాద్ రెడ్డి, శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రావు, సుబ్బారావు, సునీల్ కుమార్, సురేష్, తిప్పారెడ్డి, వెంకట్ రెడ్డి, సుజయ కృష్ణా రంగారావు, విశ్వేశ్వర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, చాంద్ బాషా, గౌతమ్ రౌడ్డి తదితరులు సస్పెండ్ అయ్యారు.












Click it and Unblock the Notifications