జగన్‌కు మరో షాక్: సైకిల్ ఎక్కే యోచనలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి..!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే అంటున్నారు. ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వైసీపీని వీడి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదిరెడ్డి తన అనుచరులతో మంతనాలు జరిపినట్లు, వారు కూడా పార్టీ మార్పుకు అంగీకరించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై 67 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెలిసిందే.

Ysr Congress party mlc adireddy apparao may join tdp

అయితే వైసీపీ అధినేత వైయస్ జగన్ తీరు నచ్చక పార్టీకి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వైసీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఫిరాయింపుల తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు.

ఇక ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విషయానికి వస్తే టీడీపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగారు. ఆ పార్టీకి 18 ఏళ్లపాటు తన సేవలనందించారు. వైయస్ జగన్ వైసీపీని స్ధాపించిన అనంతరం ఆయన వైసీపీలో చేరారు. 2013లో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆదిరెడ్డి భార్య వీరరాఘవమ్మ రాజమండ్రి మేయర్‌గా పనిచేశారు.

శ్రీకాకుళం మాజీ ఎంపీ, దివంగత టీడీపీ నేత కింజారపు ఎర్రన్నాయుడికి ఈయన స్వయాన వియ్యంకుడు. బీసీ వర్గానికి చెందిన నేతగా తూర్పు గోదావరి జిల్లాలో ఆదిరెడ్డికి మంచి పేరుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysr Congress party mlc adireddy apparao may join tdp.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి