ఐతే మీరివ్వండి: జగన్ అద్దె కట్టమని నేతలకి చెప్పారా?

YSR Congress party office to shift to Lotus Pond
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని లోటస్ పాండుకు మార్చాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయం అద్దె, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ.10 లక్షల వరకు అవుతుందట. ఈ కారణంగానే ఖాళీ చేయాలనుకుంటున్నారట.

అయితే, ఇప్పుడు పార్టీ కార్యాలయాన్ని మార్చితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పలువురు నేతలు జగన్‌కు సూచిస్తే... అద్దె మీరు కడితే ఇక్కడే కార్యాలయం కొనసాగిద్దామని అన్నారట! మీరు అద్దె కడతానంటే కార్యాలయం ఉంచుదామని వారికి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, అందుకు ఎవరు ముందుకు రాలేదట.

జూబ్లీహిల్స్‌లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న భవనాన్ని సెప్టెంబరు 8 నాటికి ఖాళీ చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం అ భవనం యాజమాన్యంతో అంగీకారానికి వచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్యాలయం తరలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్న ఆ పార్టీ... కొద్ది రోజుల అనంతరం ఖాళీ చేయనుందట. కార్యాలయం లోటస్ పాండులోని జగన్ నివాసానికి మార్చనున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+