చంద్రబాబు చెప్పిన మాటలు స్టేట్‌మెంట్‌లో ఉంటే రాజీనామా చేస్తా: వైయస్ జగన్ సవాల్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లోకసభలో నాడు కాంగ్రెస్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని, ఎంపీలుగా ఉన్న జగన్, మేకపాటి ఆ నోటీసును వెనక్కి తీసుకున్నారని ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా ఏపీ శాసనసభలో చంద్రబాబు చేసిన ఆరోపణను జగన్మోహన్ రెడ్డి ఖండించారు.

తొలిరోజు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ప్రకటనలా ఉన్నాయని ఎవరైనా అంటే తాను రాజీనామా చేస్తానని, లేదంటే చంద్రబాబు రాజీనామా చేయాలని అసెంబ్లీలో జగన్ సవాల్ విసిరారు

YSR Congress Party president YS Jaganmohan Reddy on Monday fired at Andhra Pradesh CM Chandrababu Naidu

అసెంబ్లీలో రాజకీయ కుట్రను తాము బహిర్గతం చేశామని అన్నారు. కౌరవ సభను తాము చూడలేదు గానీ, అంతకన్నా దారుణమైన సభ ఇదని ఆయన అన్నారు. రాజకీయాలు ఇంత దిగజారుతాయని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. మొత్తం అర్ధసత్యాలతో అంశాలను వక్రీకరించారని, పద్ధతి ప్రకారం చంద్రబాబు మాట్లాడిన మాటలు మాత్రమే జనంలోకి వెళ్లేలా చూశారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

సోమవారం నాటి సభ మొత్తం రాజకీయ కుట్రతోనే నడిచిందని, ప్రజలను గందరగోళపరచడమే ఆయన లక్ష్యమని అన్నారు. అసలు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఒక మాట, విజయవాడలో ఒక మాట చెప్తున్నారని ఆరోపించారు.

ప్రత్యేక హోదాపై ప్రజలను చంద్రబాబు సందేహంలో పడేశారని ఆరోపించారు. ఇలాంటి సభను తానెక్కడా చూడలేదని మండిపడ్డారు. రాజకీయాలంటే స్ట్రెయిట్ ఫర్వార్డ్ ఉండాలే గానీ, ఇలా దిక్కుమాలిన రాజకీయాలు చేయడం తగదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+