వయసైపోయింది: బాబుపై జగన్, అందుకే అబద్ధాలని ఫైర్

కృష్ణా: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు అన్ని ఫ్రీగా ఇస్తానంటున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కృష్ణా జిల్లా బంటుమిల్లిలో జరిగిన వైయస్సార్ జనభేరి సభలో ఆయన ప్రసంగించారు.

చంద్రబాబులా తాను అబద్ధాలు ఆడనని, అతనిలా విశ్వసనీయత లేని రాజకీయాలు చేయనని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబుకు ఇప్పుడు 65ఏళ్లని, ఆయనకు వయసైపోయిందని.. ఎన్నికల తర్వాత తాను, తన పార్టీ ఉండదన్న భావనతోనే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారని జగన్ ఆరోపించారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత లేకుండా పోయిందని జగన్మోహన్ రెడ్డి అన్నారు.

 YSR Congress president YS Jagan fires at Chandrababu

రాబోయే రోజుల్లో చంద్రబాబు వచ్చి అదిచేస్తాను, ఇది చేస్తాను, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తానని చెబుతున్నారని, ఇప్పుడు ఇచ్చే హామీలు తన తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలు కూడా ఇస్తున్న హామీలపై చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు.
హామీలు ఇవ్వడం, వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటేనని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

చంద్రబాబు తన పాలనలో రెండు రూపాలయలకు కిలో బియ్యాన్ని రూ. 5కు పెంచారని, మద్యం విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తేశారని జగన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తుంటే.. ఓ వైపు అన్యాయమంటూనే పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలతో విభజన బిల్లుకు మద్దతు పలికేలా చూశారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓటేసి సుపరిపాలనకు అవకాశమివ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+