నేతలు తన్నుకున్నారు! ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా
రాజమండ్రి: తూర్పు గోదావరగి జిల్లాలోని రాజమండ్రి మున్పిసల్ కార్పోరేషన్ సభ బుధవారం నాడు ఉదయం రసాభాసగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు ఒకరి పైన మరొకరు చేయి చేసుకున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అప్పారావుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఇరు పార్టీలు మధ్య ఉద్రిక్తత తలెత్తింది. ఒకరిని ఒకరు తోసుకున్నారు. అది కొట్టుకునే దాకా వచ్చింది.

సమావేశంలో సభ్యుల బాహాబాహీతో మున్సిపల్ కార్పొరేషన్ మేయరు రజనీశేషసాయి సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లారు.
రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు సైతం ఒకరినొకరు తోసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ మురళీ సమావేశానికి వచ్చిన ఇతరులను బయటకు పంపించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణ పడుతున్న సభ్యులను వారించారు.
టీడీపీ కార్యకర్త ఇంటిపై బాంబు దాడి
గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెంలో టీడీపీ కార్యకర్త ఇంటిపై బాంబు దాడి జరిగిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సదరు కార్యకర్త గోదావరి జిల్లాలో మూడేళ్ల క్రితం లిక్కర్ సిండికేట్‌లో వ్యాపారం చేశారని, ఆ వ్యాపార లావాదేవీలు సెటిల్ కాలేదని, దానికి సంబంధించి ఇద్దరు, ముగ్గురు గత రెండు రోజులుగా నాగిరెడ్డి పాలెంలో తిరుగుతున్నారని, ఈ ఘాతుకానికి వారే పాల్పడి ఉంటారని ఆయన బంధువులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!