గుట్టురట్టు: వైయస్ జగన్ పార్టీ గడియారాల పట్టివేత
బళ్లారి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి ఫొటోలతో ఉన్న గోడగడియారాలను బెంగళూరు నుంచి బళ్లారి మీదుగా అనంతపురం జిల్లా రాయదుర్గం తరలిస్తుండగా బళ్లారి పోలీసులు గురువారంనాడు పట్టుకున్నారు.
గోడ గడియారాలు బళ్లారి నగరానికి పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు సిటీ డీఎస్పీ మురుగణ్ణవర్‌కు సమాచారం అందడంతో ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. స్థానిక మోతీ సర్కిల్‌లోని ఇందిరా ట్రాన్స్‌పోర్టుకు బెంగళూరు నుంచి పెద్ద సంఖ్యలో బాక్సులు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహించారు.

బాక్సుల్లో ఉన్న 600 గోడ గడియారాలను గుర్తించి, జిల్లా ఎన్నికల అధికారి బిస్వాస్‌కు సమాచారం అందించారు. ఆయన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారాన్ని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్‌కు అందించారు.
కాగా, బళ్లారిలోని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇంటిపైనా గురువారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఆయన ఇంటిలో ఉన్న రూ. 43 లక్షల బ్లాంక్ చెక్కును, వెయ్యి చీరలను, 25 క్రికెట్ బ్యాట్లను, వంద వికెట్లను, 13 గ్యాస్ స్టవ్‌లను సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications