షర్మిలకు అదీ దక్కనీయని జగన్: ఇక మిగిలింది అదొక్కటే -విజయమ్మ ఆశలు అవే..!!
వైఎస్సార్ బిడ్డలు ఇద్దరూ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారు. తన మాట కాదని తెలంగాణలో పార్టీ ప్రారంభించిన తీరు తో చెల్లి పైన జగన్ ఆగ్రహంగా ఉన్నారు. తండ్రి సమాధి వద్ద చాలాకాలం తరువాత ఒకే వేదిక మీదకు అన్నా - చెల్లి వచ్చారని అందరూ ఆసక్తిగా చూసారు. కానీ, ఇద్దరూ ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరించారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ కేంద్రంగా విజయమ్మ తన భర్త వైఎస్సార్ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసారు. అయితే, ముందుగానే ఆ సమావేశం అంతర్యం తెలిసిపోవటంతో విజయమ్మ-షర్మిల ఆశించిన వారెవరూ అక్కడ కనిపించలేదు.

ఆలస్యంగా గ్రహించిన షర్మిల..
వచ్చిన వారు సైతం తమతో వైఎస్సార్ కు ఉన్న అనుబంధం గురించి వివరించి..వెంటనే వెళ్లిపోయారు. తెలంగాణలో షర్మిలకు మద్దతుగా నిలుస్తామనే సంకేతాలు ఎక్కడా కనిపించలేదు. ఏపీలో వైఎస్సార్ లెగసీ పోగొట్టుకొని తాము ఎంత నష్టపోయామో తెలుసుకున్న కాంగ్రెస్ తెలంగాణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. కేవలం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా మరెవరూ హాజరు కాలేదు. ఇక కేవీపీ, ఉండవల్లి, రఘవీరా ద్వారా ఇప్పుడు షర్మిలకు రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే, ఏపీ నుంచి ఏ ఒక్క నేత వైసీపీ నుంచి హాజరు కాలేదు.

జగన్ అది కూడా దక్కనీయలేదుగా..
కాంగ్రెస్ నేతలు ముందుకు రాలేదు. ఇక, షర్మిలకు అప్పటికే అర్దమైపోయింది. తాను నమ్ముకున్న వైఎస్సార్ లెగసీ ఇప్పటికే తన అన్నకే దక్కిందనే విషయం అర్దం కావటానికి ఇంత సమయం పట్టింది. ఇదే విజయమ్మ..షర్మిల నాడు జగన్ కోసం వైఎస్సార్ పేరు చెబుతూ నాడు ఉప ఎన్నికల ప్రచారంలో అయినా, తరువాత 2014, 2019 ఎన్నికల సమయంలో అయినా జగన్ కు మద్దతుగా ప్రచారం చేసారు. తెలంగాణ ప్రాంతంలోనూ గతంలో రాజకీయంగా షర్మిల నాడు తన తండ్రి వారసత్వాన్ని తన అన్నకు ఇవ్వమంటూ ప్రజల మధ్యకు వెళ్లారు.

తండ్రి వారసత్వం తెలంగాణలో నిలబెట్టేనా
అన్నా - చెల్లి మధ్య విభేదాలు ఎలా ఉన్నా..తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్ ను అడగండంటూ చెప్పుకొచ్చిన షర్మిల..తెలంగాణలో ఇంకా వైఎస్సార్ లెగసీ నే నమ్ముకొని రాజకీయం చేయాలని భావిస్తున్నారు. ఏపీలో ఎక్కడా వైఎస్సార సెంటిమెంట్ - లెగసీ తగ్గకుండా జగన్ జాగ్రత్త పడ్డారు. కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం వైఎస్సార్ పేరు ఓన్ చేసుకోకుండా వారందరినీ దూరం పెట్టారు. ఒక రంగా జగన్ వారిని దూరం పెట్టిన కారణంగానే..వైసీపీలో పూర్తిగా ఇప్పటికీ జగన్ మాట-ఆధిపత్యం గ్రూపులు లేకుండా నిలబడి ఉందని పార్టీ నేతలే అంగీకరిస్తారు.

జగన్ పక్కాగా..తండ్రి ఇమేజ్ ఓన్ చేసుకుంటూ..
వైఎస్సార్ కుమారుడిగా జగన్ కు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఏపీ ప్రజలు డిసైడ్ అయ్యారు. ఆ అవకాశం ఇచ్చారు. అదే సమయంలో చంద్రబాబు స్వీయ తప్పిదాలు సైతం జగన్ కు కలిసి వచ్చాయి. ఇక, ఇప్పుడు తెలంగాణలో అదే రకంగా తన అన్న కు దక్కిన విధంగానే తన తండ్రి వారసత్వం సాధించుకోవాలని షర్మిల ప్రయత్నాలు సఫలమవుతాయా అంటే ఇదే విధంగా ముందుకు వెళ్తే నో అనే చెప్పాలి. తండ్రి లెగసీని పూర్తిగా జగన్ మరెవరికీ ..చివరకు తన చెల్లిక కూడా దక్కకుండా ఓన్ చేసేసుకున్నారు.

పాదయాత్ర పైనే షర్మిల ఆశలన్నీ..
ఇక, ఇప్పుడు షర్మిల నమ్ముకుంటోంది పాదయాత్ర ఒక్కటే. అక్టోబర్ 18 నుంచి చేవెళ్ల కేంద్రంగా పాదయాత్ర ప్రారంభిస్తానని షర్మిల ప్రకటించారు. గతంలో షర్మిల అన్నకు మద్దతుగా పాదయాత్ర ప్రారంభించిన తేదీ సైతం అక్టోబర్ 18. ఇక, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి..వారికి దగ్గరవ్వాలనేది షర్మిల లక్ష్యం. కానీ, ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్రకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో షర్మిల పాదయాత్రకు వచ్చే స్పందన సైతం వేచి చూడాలి.

ప్రశాంత్ కిషోర్ గట్టెక్కిస్తారా... ఏం జరుగుతోంది..
ఇదే సమయంలో షర్మిల వెనుక పార్టీలో నడిచే నేతలెవరనేది మరో ప్రశ్న. తన కుమారుడు సీఎం అవ్వటంతో..ఇక, తన కుమార్తె సైతం రాజకీయంగా ఉన్నత పదవిలో ఉండాలనేది విజయమ్మ కోరిక. ఇందు కోసం వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం చేస్తున్న సూచనలను ఫాలో అయ్యేందుకు సిద్దం అవుతున్నారు. వచ్చే రెండేళ్లు ప్రజల్లోనే ఉండాలని..కుమార్తెతో కలిసి నడవాలని విజయమ్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఏపీకి భిన్నంగా సాగే తెలంగాణ రాజకీయాల్లో విజయమ్మ- షర్మిల అడుగులు వారికి ఏ మేర కలిసి వస్తాయో చూడాలి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications