షర్మిల, సునీతపై వైఎస్ సోదరి విమల సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికల సమయంలో షర్మిల -సునీత వ్యాఖ్యలు కలకలంగా మారుతున్నాయి. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల తన చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాశం పైనా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తన అన్న జగన్ పైన షర్మిల విరుచుకుపడుతున్నారు. షర్మిల - సునీత చేస్తున్న వ్యాఖ్యలపైన వైఎస్సార్ సోదరి విమల స్పందించారు. కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైయ‌స్‌ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని విమల ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ ఇద్దరి తీరు సరి కాదు
షర్మిల, సునీతలు ఏది మాట్లాడినా కరెక్ట్‌ అని ఎలా అనుకుంటున్నారని, వివేకా కేసులో నిత్యం అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తానూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నట్లు చెప్పారు.

YSR Sister Vimalamma sensational comments on YS Sharmila and Dr Sunitha

షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసానని.. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదన్నారు. నిత్యం షర్మిల అవినాష్‌ను విమర్శిస్తున్నారని చెప్పారు. అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారని చెప్పుకొచ్చారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకని వ్యాఖ్యానించారు.

మీరే ఆలోచించండి
హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడని... అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా అంటూ విమల నిలదీసారు. అవినాష్ 10ఏళ్లు చిన్నవాడని... అతనికి కుటుంబం ఉందన్నారు. ఏ పాపం చేయని తన సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నారన్నారు. అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారని వివరించారు.

హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తమ ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉందన్నారు. శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలని... వైయ‌స్ఆర్‌ ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారని విమల చెప్పుకొచ్చారు.

షర్మిల వెనుక వారే ఉన్నారు
వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే తనకే ఎక్కువ ఇష్టమని చెప్పారు. షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారన్నారు. వైయ‌స్ జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు. వివేకం, వైయ‌స్ఆర్‌ ఇద్దరూ ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదన్నారు.

మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండిని చెప్పుకొచ్చారు. పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పన్నారు. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పని.. వైయ‌స్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదని చెప్పారు. వైయ‌స్ఆర్‌ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారని విమల చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+