ఏపీలో మారుతున్న సమీకరణాలు-వైసీపీ, టీడీపీ వ్యూహాల వేట-ఆప్షన్ ఓపెన్ చేసిన మోడీ ?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. గతంలో జరిగిన ఏ ఎన్నికల్లో లేనంత స్ధాయిలో ఈసారి 2024 ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమైపోతున్నాయి. దీనికోసం రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ అనుసరిస్తున్న వ్యూహాలు ఆసక్తిరేపుతున్నాయి. ఇందులో వైసీపీ ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వ్యూహాన్ని మరోసారి అనుసరిస్తూనే కొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. అదే సమయంలో టీడీపీ ఏ వ్యూహం అనుసరించాలో తెలియక మథనపడుతోంది.

 ఏపీలో రాజకీయ వ్యూహాల వేట

ఏపీలో రాజకీయ వ్యూహాల వేట

ఏపీలో ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో బిజీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు ఇప్పటివరకూ అనుసరిస్తున్న వ్యూహాలు సరిపోకపోవడంతో కొత్త వ్యూయహాల వేటలో మునిగితేలుతున్నాయి. ఇందుకోసం కొత్త వ్యూహకర్తల నియామకాలతో పాటు, సలహాలు, సూచనలు, ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయ రణరంగం కాక రేపుతోంది. ఈ మథనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అమల్లో పెట్టేయాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.

కొత్త వ్యూహం వేటలో వైసీపీ ?

కొత్త వ్యూహం వేటలో వైసీపీ ?

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. అయినా పార్టీలు మాత్రం సన్నాహాల్లో మునిగితేలుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండమని క్యాడర్ ను కోరుతున్నాయి. అదే సమయంలో వైసీపీ పాత వ్యూహంతో ఈసారి కూడా ముందుకెళ్లే పరిస్ధితులు లేవు.అప్పట్లో చంద్రబాబును అధికారంలో నుంచి దింపడమే లక్ష్యంగా పీకే సాయంతో పలు వ్యూహాలు రచించిన వైసీపీ ఇప్పుడు మాత్రం కేవలం తన సంక్షేమ జాతరను నమ్ముకుని బరిలోకి దిగాల్సిన పరిస్ధితి. అయితే సంక్షేమంలో లోటుపాట్లు కొంప ముంచుతాయనే భయం వెంటాడుతోంది. అలాగని పూర్తిస్ధాయిలో సంక్షేమం అమలు చేస్తే తలెత్తే పరిణామాల్ని కూడా విశ్లేషించుకుంటోంది. అందుకే ఇంతకు ముంచిన కొత్త వ్యూహాన్ని తయారు చేయాలని వ్యూహకర్త రిషిరాజ్ సింగ్ ను జగన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐప్యాక్ కొత్తగా రిక్రూట్ మెంట్లు కూడా భారీ ఎత్తున చేపడుతోంది.

వ్యూహం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ !

వ్యూహం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ !


ఏపీలో 2019 ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీడీపీని నామరూపాల్లేకుండా చేసి తిరిగి లేవనీయకుండా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కావడం లేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో టీడీపీ కంటే బలమైన ప్రత్యామ్నాయం కనిపించకపోవడమే. అలాగే క్షేత్రస్ధాయిలో ఆ పార్టీకి ఉన్న క్యాడర్ తో పాటు నేతలు కూడా ఆ పార్టీకి ఊపిరిలూచుతున్నారు. అయితే వ్యూహం మాత్రం ఖరారు కాకపోవడంతో టీడీపీ దీని కోసం తీవ్రంగా పాట్లు పడుతోంది. తాత్కాలికంగా నియమించిన సునీల్ కానుగోలు సైతం కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోవడంతో చేసేది లేక ప్రత్యామ్నాయాల కోసం ఎదురుచూస్తోంది. త్వరలో ఈ సమస్యను అధిగమించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

కీలకంగా మోడీ పాత్ర ?

కీలకంగా మోడీ పాత్ర ?

ఏపీలో మారుతున్న పరిస్ధితుల్లో ఇన్నాళ్లూ వైసీపీకి అండగా నిలిచి, ఆ పార్టీ సాయం తీసుకున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మనసుమార్చుకునేలా కనిపిస్తోంది. వైసీపీని మాత్రమే నమ్ముకుంటే రేపు టీడీపీవైపు జనం మొగ్గితే పరిస్ధితి ఏంటన్న భయం బీజేపీలో మొదలైంది. దీంతో తాజాగా తమ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు మద్దతిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన ఆత్మీయ భేటీకి బీజేపీ నేతలు సోము వీర్రాజు, కిషన్ రెడ్డి హాజరయ్యారు. చంద్రబాబుకు ధన్యవాదాలు కూడా తెలిపారు. దీంతో రేపు ఎన్నికల్లో తాము అన్ని ఆప్షన్లను ఓపెన్ గానే ఉంచుకున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. దీంతో మోడీ మద్దతు వైసీపీ, టీడీపీకి కీలకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+