వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన - సీఎం జగన్ మార్క్ ఎంపిక..!!

సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వైసీపీ 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించింది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఖరారు చేసారు. వీరి పేర్లను పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది. స్థానిక సంస్థల కోటా నుంచి 9..ఎమ్మెల్యే కోటా నుంచి 7.. గవర్నర్ కోటాలో రెండు సీట్లు కలిపి మొత్తం 18 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేసారు. ఇందులో 11 సీట్లు బీసీలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయ్యారు.

ఎస్సీ వర్గానికి 2 సీట్లు...ఎస్టీ నుంచి ఒకరికి ఇవ్వగా.. ఓసీలకు నాలుగు సీట్లు కేటాయించారు. సుదీర్ఘ కసరత్తు తరువాత ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ఖరారు చేసిన వారి పేర్లను ప్రభుత్వ సలహాదారు..పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్దుల ఖరారును పరిగణలోకి తీసుకొని ఈ పేర్లకు ఆమోద ముద్ర వేసినట్లు కనిపిస్తోంది.

బీసీ-ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత

బీసీ-ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత


ఈ నిర్ణయంలో బీసీ వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య 19కి పెరగనుంది. ఓసీ ఎమ్మెల్సీల సంఖ్య 14కి చేరింది. ఇప్పటికే అయిదుగురు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసన సభ స్పీకర్ బీసీ వర్గానికి చెందిన సీతారాం ఉన్నారు. శాసనమండలి ఛైర్మన్ గా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజు వ్యవహరిస్తున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ గా మైనార్టీ మహిళ కొనసాగుతున్నారు.

దీని ద్వారా మండలిలో బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 68 శాతం కేటాయించినట్లు సజ్జల వివరించారు. టీడీపీ హయాంలో ఇదే వర్గాలకు 37 శాతం ప్రాధాన్యత దక్కింది. ఇదే సమయంలో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ సీఎం జగన్ ఇప్పటి వరకు సామాజిక న్యాయం నిదానం కాదు విదానం అనే విధంగా అమలు చేసారని సజ్జల చెప్పుకొచ్చారు.

అభ్యర్ధుల జాబితా ఇలా

అభ్యర్ధుల జాబితా ఇలా


స్థానిక సంస్థల కోటా నుంచి తొమ్మది మందిని ప్రకటించారు. అందులో శ్రీకాకుళం నర్తు రామారావు (బీసీ), కుడిపూడి సూర్యనారాయణ (తూ గో) వంకా రవీంద్రనాద్ (కాపు-పగో), కవురు శ్రీనివాస్(పగో) మేరుగ మరళీధర్ (గూడూరు),సిపాయి సుబ్రమణ్యం (చిత్తూరు) రామసుబ్బారెడ్డి (జమ్మల మడుగు -కడప) డాక్టర్ మధుసూధన్ (బీసీ - బీయ- కర్నూలు) మంగమ్మ- మాజీ ఎంపీ గంగాధరం సతీమణి ( బీసీ బోయ) కు కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఈ పేర్లు ఖరారు చేసారు.

ఎమ్మెల్యే కోటాలో భాగంగా..పెన్మత్స సూర్యనారాయణ రాజు ( విజయనగరం - ఓసీ) ,పోతుల సునీత (బీసీ -ప్రకాశం), కోలా గురువులు( బీసీ - విశాఖ), బొమ్మి ఇజ్రాయిల్ (ఎస్సీ-మాదిగ) తూర్పు గోదావరి, జయమంగళం వెంటకరమణ ( బీసీ - ఏలూరు), చంద్రగిరి ఏసురత్నం ( వడ్డెర -గుంటూరు), మర్రి రాజశేఖర్ (కమ్మ-గుంటూరు) పేర్లు అధికారికంగా ప్రకటించారు.

మర్రి రాజశేఖర్ కు దక్కిన ఛాన్స్

మర్రి రాజశేఖర్ కు దక్కిన ఛాన్స్


ఇక, గవర్నర్ కోటా నుంచి ఇద్దరి పేర్లు ఖరారు అయ్యాయి. అందులో ఎస్టీ వర్గానికి చెందిన కుంభా రవిబాబు, కాకినాడ కు చెందిన మత్స్యకార వర్గానికి చెందిన మహిళా నేత కర్నే పద్మశ్రీ పేర్లు ఫైనల్ చేసారు. ఎంతో కాలంగా ప్రచారంలో ఉన్నా..ఎమ్మెల్సీగా అవకాశం దక్కని మర్రి రాజశేఖర్ కు సీటు ఖరారు చేసారు.

ప్రస్తుతం ఆయన క్రిష్ణా జిల్లా పార్టీ ఇంఛార్జ్ గా ఉన్నారు. అదే సమయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న చంద్రగిరి ఏసురత్నం కు ఎమ్మెల్సీ సీటు ఖరారు చేసారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు పైన ముందస్తు అంచనాలతోనే ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు ప్రాంతాలు - సామజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసినట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+