వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన - జగన్ ఆమోదం: జాబితా విడుదల..!!

వైసీపీ నుంచి ఎమ్మెల్సీల అభ్యర్ధులను పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో మూడు..స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అయితే, అటు శాసనసభలో..ఇటు 13 జిల్లాల స్థానిక సంస్థల్లో వైసీపీ పూర్తి మెజార్టీ ఉండటంతో మొత్తం 14 స్థానాలు వైసీపీ ఖాతాలోనే జమ కానున్నాయి. చివరి నిమిషం వరకు పెండింగ్ లో పెట్టకుండా ముందుగానే అభ్యర్ధుల ను ఖరారు చేయటం ద్వారా పార్టీలో ఎటువంటి గందరగోళానికి అవకాశం లేకుండా సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆమోదించిన జాబితాను సజ్జల ప్రకటించారు.

ఎమ్మెల్యే కోటా పేర్లు అధికారిక ప్రకటన

ఎమ్మెల్యే కోటా పేర్లు అధికారిక ప్రకటన

సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను పక్కగా అమలు చేస్తూ అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసారు. అందులో భాగంగా.. ఎమ్మెల్యే కోటా నుంచి తాజాగా పదవీ విరమణ చేసిన డీసీ గోవిందరెడ్డి... బీసీ కోటాలో శ్రీకాకుళం జిల్లా పాలవలస రాజశేఖర్ కుమారుడు విక్రాంత్ పేరు ఖరారు చేసారు. మూడో స్థానం నుంచి మైనార్టీ కోటాలో భాగంగా.. కర్నూలు జిల్లా నుంచి నంధ్యాలకు చెందిన మార్కెట్ యార్డు ఛైర్మన్ ఇషాక్ భాషా పేరు ప్రకటరించారు. ఇక, స్థానిక సంస్థల కోటా అభ్యర్ధుల పేర్లు త్వరలో ప్రకటించనున్నారు.

రెడ్డి- బీసీ- మైనార్టీ వర్గాలకు కేటాయింపు

రెడ్డి- బీసీ- మైనార్టీ వర్గాలకు కేటాయింపు


అయితే, ఇప్పటికే ఆ పేర్లకు సైతం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. విజయనగరం నుంచి రఘురాజు పేరు దాదాపు ఖరారైంది. విశాఖలో రెండు స్థానాలు ఉండగా.. ఒక స్థానం నుంచి వంశీ క్రిష్ణ , కాగా, రెండో స్థానం నుంచి విరుదు కళ్యాణి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తూర్పు గోదావరి నుంచి అనంత ఉదయ భాస్కర్ పేరు దాదాపు ఖరారైంది. కృష్ణా జిల్లా నుంచి రెండు స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రభుత్వ సలహాదారుడు తలశిల రఘురాంకు కేటాయించగా, రెండో స్థానం బీసీ వర్గానికి కి ఖరారు చేసారు.

Recommended Video

    ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu
    స్థానిక సంస్థల కోటా అభ్యర్ధుల ప్రకటన త్వరలో

    స్థానిక సంస్థల కోటా అభ్యర్ధుల ప్రకటన త్వరలో


    గుంటూరు నుంచి రెండు స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి తాజాగా ఎమ్మెల్సీగా రిటైరైన ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు.. కాగా, రెండో స్థానం నుంచి మర్రి రాజశేఖర్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోందిజ. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు అభ్యర్దిత్వానికి ఆమోద ముద్ర వేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా నుంచి కుప్పం ఇన్ఛార్జ్ గా ఉన్న భరత్ పేరును ఓకే చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ 11 పేర్లను ఒకటి రెండు రోజల్లో వైసీపీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+