ఎగ్జిట్‌పోల్స్: వైఎస్ఆర్ సీపీ మీడియా ప్రతినిధులు వీరే..
అమరావతి: మరి కొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. దీనికోసం అన్ని పార్టీలూ తమ యంత్రగాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ , విజయావకాశాలు, గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయంటూ అన్ని పార్టీలూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి. ఫలితాలు వెల్లడి కావడానికి నాలుగురోజుల ముందు వెలువడే ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చేసుకుని, తమ పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయనే అంశంపై ఓ నిర్ధారణకు వస్తాయి రాజకీయ పార్టీలు.
ఎగ్జిట్‌పోల్స్ వెలువడిన వెంటనే- దాదాపు అన్ని మీడియా సంస్థలు ఆయా పార్టీలను సంప్రదించి, డిబేట్లను ఏర్పాటు చేస్తాయి. దీనికోసం ఈ డిబేట్లకు ఎవరెవరు హాజరు కావాలనే విషయంపై వైఎస్ఆర్ సీపీ క్లారిటీలో ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఛానళ్ల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొందరు నాయకులకు ఈ బాధ్యతలను అప్పగించింది.

తెలుగు ఛానళ్ల కోసం- పార్థసారథి, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, ఆర్.కె.రోజా, కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, కోన రఘుపతి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, శ్రీకాంత్‌రెడ్డి, పుష్ప శ్రీవాణి, కురసాల కన్నబాబు, సుధాకర్‌బాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, ఎంవీఎస్ నాగిరెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్.
ఇంగ్లిషు ఛానళ్ల కోసం: విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, అనిల్ యాదవ్, బుట్టా రేణుక, పీవీపీ ప్రసాద్.
హిందీ ఛానళ్ల కోసం.. మహ్మద్ ఇక్బాల్, రెహమాన్‌లను నియమించింది.












Click it and Unblock the Notifications