కామినేనిపై నాగార్జున ఫైర్! రాజీనామా చేయాలని డిమాండ్
హైదరాబాద్ : డెంగీ, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం ఇదేమి పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా ఇదే విషయంపై వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున.. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేశారు.

అసలు రక్తపోటును కూడా పరీక్షంచడం చేతగాని కామినేని శ్రీనివాస్ ఎంబీబీఎస్ పట్టా ఎలా సంపాదించారని ఎద్దేవా చేశారు నాగార్జున. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతుంటే మంత్రి కామినేని శ్రీనివాస్ కు మాత్రం అవేవి పట్టడం లేదని ఆరోపించారు. డెంగీ, చికెన్ గున్యా లాంటి వ్యాధులను అరికట్టడానికి అవసరమైన చర్యలేవి ఇంతవరకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న మంత్రి కామినేని తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నాగార్జున. ఇక సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఆలోచనలన్ని కేసులు కాంట్రాక్టుల్లో వాటాలు, కమిషన్ల చుట్టే తిరుగుతుంటాయని, మంత్రులు కూడా కమిషన్లపై ఫోకస్ పెడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications