టీడీపీ #whoKilledBabaiకి వైసీపీ #WhoKilledPinni కౌంటర్-సోషల్ మీడియాలో ట్రెండింగ్
ఏపీ రాజకీయాలు నానాటికీ పతనావస్ధకు చేరుకుంటున్నాయి. నిన్న మొన్నటివరకూ సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్యలో వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ హూకిల్డ్ బాబాయ్ ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీంతో వైసీపీకి మంటపుట్టింది. అయితే ఏమీ చేయలేని పరిస్ధితి. కానీ ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది కూడా వివేకా తరహాలో అనుమాస్పద మృతి కేసే.దీంతో వైసీపీ ఇప్పుడు కౌంటర్ ప్రచారం మొదలుపెట్టేసింది.

టీడీపీ హూకిల్డ్ బాబాయ్
గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ పాత్ర ఉందంటూ ఎన్నికల్లో ప్రచారం చేసుకుని వైసీపీ గెలిచిందంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించేవారు. ఇదే క్రమంలో జగన్ ను ఇరుకునపెట్టేందుకు టీడీపీ హూకిల్డ్ బాబాయ్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. గుండెపోటుగా మొదలై, ఆ తర్వాత గొడ్డలిపోటుగా మారిన వివేకా అనుమాస్పద హత్యపై ఇప్పటికీ సీబీఐ దర్యాప్తు జరుగుతూనే ఉంది. కానీ అసలు హంతకులు మాత్రం దొరకడం లేదు. దీంతో కొంతకాలం క్రితం టీడీపీ హూకిల్డ్ బాబాయ్ ప్రచారాన్ని గట్టిగా తెరపైకి తెచ్చింది. దీన్నే సోషల్ మీడియాలో ఊదరగొట్టింది. అయితే అది టీడీపీకి అంతగా కలిసి రాలేదు. వైసీపీకి మాత్రం ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత టీడీపీ దాన్ని లైట్ తీసుకుంది.

హూకిల్డ్ పిన్ని అంటూ వైసీపీ కౌంటర్
తాజాగా ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు మరదలు కూడా అయిన ఉమామహేశ్వరి హైదరాబాద్ లోని నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో పిన్నిని ఎవరు చంపారనే వాదనను వైసీపీ తెరపైకి తెస్తోంది. సోషల్ మీడియాలో హూకిల్డ్ పిన్ని అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఈ ప్రచారాన్ని ఊదరగొడుతోంది. చంద్రబాబును ఇబ్బందిపెట్టే లక్ష్యంతో వైసీపీ ప్రారంభించిన ఈ ప్రచారం ఇప్పుడు టీడీపీని చికాకుపెట్టేలా కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో హోరు
టీడీపీ గతంలో ప్రారంభించిన హూకిల్డ్ బాబాయ్ ప్రచారానికి కౌంటర్ గా వైసీపీ ఇప్పుడు హూకిల్డ్ పిన్ని ప్రచారాన్ని తెరపైకి తెస్తోంది. దీన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పై హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మరీ ప్రచారం చేస్తుండటంతో టీడీపీ ఇబ్బందుల్లో పడుతోంది.దీంతో టీడీపీ నేతలు కూడా తిరిగి హూకిల్డ్ బాబాయ్ ప్రచారానికి పదునుపెడుతున్నారు. దీంతో వీరిద్దరి కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఇకపై బాబాయ్ వివేకా గురించి టీడీపీ నేతలు మాట్లాడితే పిన్నితో సమాధానం చెప్పాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications