జెండా పీకేస్తారు: జగన్ నిర్ణయంపై భారత్ ఏక్తా ఆగ్రహం

జివోఎం సమావేశాన్ని బహిష్కరించాలని ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇడుపులపాయ ప్లీనరీలో తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పిన జగన్ ఇప్పుడు జివోఎంను బహిష్కరిస్తామని చెప్పడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
నిలకడలేని విధానాలతో ఆ పార్టీ ప్రజల్లో చులకన అవుతుందన్నారు. సమైక్యాంధ్రకే తాము కట్టుబడి ఉన్నామని, కేంద్రం త్వరలో ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశానికి వ్యతిరేకిస్తున్నామని చెప్పడం ద్వారా ఆ పార్ట అధ్యక్షుడు వైయస్ జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు.
కాగా, విభజనకు తమ పార్టీ వ్యతిరేకమని జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీ నేతలు మైసూరా రెడ్డి, కొణతాల రామకష్ణ ఆ లేఖను ఆదివారం పత్రికలకు విడుదల చేశారు. తమ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని, ఎలాంటి విభజనకైనా తాము వ్యతిరేకమని ఆ లేఖలో జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించబోమన్నారు.












Click it and Unblock the Notifications