పులివెందులలో షర్మిల ప్రచారం అడ్డుకున్న వైసీపీ-తేల్చుకుందామని సునీత సవాల్..!
ఏపీలో ఎన్నికల వేళ కడప లోక్ సభ సీటులో రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ప్రచారానికి వెళ్లిన పీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి వైఎస్ షర్మిల, ఆమెకు మద్దతుగా కలిసి ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వివేకా హంతకులకు మద్దతిస్తారా, రాజశేఖర్ రెడ్డి బిడ్డకు మద్దతిస్తారా అంటూ షర్మిల విసురుతున్న సవాళ్లపై వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
లింగాల మండలంలో వైఎస్ షర్మిల ప్రచారం చేస్తుండగా.. వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ఓడిపోతాడనే భయం వైసీపీకి పట్టుకుందని, అందుకే మమ్మల్ని అడ్డుకుంటున్నారని తెలిపారు. మీరు ఎంతైనా అరుచుకోండి, మాకేం అభ్యంతరం లేదన్నారు. ఇంకా వైసీపీ నినాదాలు ఆగకపోవడంతో ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్నాయి. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో షర్మిల ప్రచారం కొనసాగింది.

అవినాష్ అంటే తమకు గతంలో కోపం లేదని, కానీ సీబీఐ అతన్ని హంతకుడని తేల్చిందని షర్మిల తెలిపారు. కానీ జగన్ అతనికి శిక్ష పడకుండా కాపాడుతున్నారని విమర్శించారు. జగన్ అవినాష్ కు అండగా నిలబడటం వల్లే తాను పోటీ చేయాల్సి వస్తోందన్నారు. అల్లరి చేసే వాళ్లు పులివెందుల పూల అంగడికి వస్తే అక్కడే తేల్చుకుందామన్నారు. వివేకా కుమార్తె సునీత కూడా తాను చెప్పే దానిలో తప్పుంటే పులివెందుల పూల అంగడికి రావాలని సవాల్ విసిరారు. అక్కడే పంచాయితీ పెట్టుకుందాం రావాలని అవినాష్ రెడ్డిని కోరారు.
అధికారం అడ్డుపెట్టుకొని దోషులను కాపాడుతున్నారు. సిబిఐ హంతకులుగా చేర్చిన వారిని కాపాడటానికా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే మీ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. అధర్మాన్ని ఎదురించేందుకు ఎంపీగా నిలబడ్డా. ధర్మం వైపు మీ వైఎస్ఆర్ బిడ్డ.. అధర్మం వైపు… pic.twitter.com/zvDVKWsVl9
— YS Sharmila (@realyssharmila) April 12, 2024












Click it and Unblock the Notifications