Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ డబుల్ గేమ్ ప్రచారం..! వైసీపీ క్లారిటీ ఇదే..!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం అంతకంతకూ పెరుగుతోంది. ఇదే క్రమంలో నిన్న ఓ అంశానికి సంబంధించి ఇలాగే తీవ్ర ప్రచారం జరిగింది. వైసీపీ అధినేత జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారనేది ఆ ప్రచారం సారాంశం. దీనిపై వైసీపీ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. అసలేం జరిగిందో వివరిస్తూ సాక్ష్యాన్ని సైతం బయటపెట్టింది.

అసలు విషయానికొస్తే.. కేంద్రం వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. తొలుత లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్న కేంద్రం.. ఆ తర్వాత తాజాగా రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించుకుంది. అయితే లోక్ సభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమ ఎంపీలకు విప్ జారీ చేసి ఓటు వేసిన వైసీపీ.. రాజ్యసభకు వచ్చే సరికి మాత్రం విప్ జారీ చేయలేదన్న ప్రచారాన్ని కూటమి పార్టీల సానుభూతిపరులు సోషల్ మీడియాలో తీవ్రంగా చేసారు. జగన్ డబుల్ గేమ్ అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.

ysrcp clarified to rumours on issue of whip to rajya sabha mps during wakf bill debate

దీంతో వైసీపీ ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో తమ ఎంపీలకు పార్టీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి జారీ చేసిన విప్ ను బయటపెట్టింది. ఇందులో కేంద్రం తెస్తున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యసభలో స్పందించాలని, ఓటింగ్ వేయాలని పార్టీ ఎంపీలను వైవీ సుబ్బారెడ్డి కోరారు. దీంతో వైసీపీ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేయలేదన్న ప్రచారానికి చెక్ పడినట్లయింది.

2025 వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేయలేదని ఒక వర్గం మీడియా, కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ వ్యాపింపజేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజ్యసభ సభ్యులందరూ సభలో హాజరు కావాలని, వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశిస్తూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ స్పష్టమైన, అధికారిక విప్ జారీ చేసిందని స్పష్టం చేసింది.

ప్రజలను తప్పుదారి పట్టించడానికి లేదా వాస్తవాలను వక్రీకరించడానికి చేసే ప్రయత్నాల వెనుక రాజకీయం ఉందని, దీన్ని ఖండిస్తున్నట్లు వైసీపీ తెలిపింది. వైసీపీ లౌకిక విలువలకు తన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని తెలిపింి. అలాగే నిరాధారమైన ఊహాగానాలను ప్రసారం చేసే ముందు వాస్తవాలను ధృవీకరించాలని మీడియా సంస్థల్ని కోరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+