వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బలగాలు కావాలి, అందుకే: నంద్యాలపై బాబుకు జగన్ పార్టీ షాక్

నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం సీఈసీ అచల్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం సీఈసీ అచల్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

నంద్యాలపై ప్రశ్నిస్తారా?: శిల్పా మోహన్ రెడ్డిపై టిడిపి కొత్త అస్త్రాలునంద్యాలపై ప్రశ్నిస్తారా?: శిల్పా మోహన్ రెడ్డిపై టిడిపి కొత్త అస్త్రాలు

ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పింఛన్లు, రోడ్లు అంటూ ప్రజలను బెదిరిస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇందుకే.. టిడిపి గుర్తింపు రద్దు చేయాలి

ఇందుకే.. టిడిపి గుర్తింపు రద్దు చేయాలి

టిడిపికి ఓటు వేయకుంటే రోడ్డుపై ఎలా తిరుగుతారని, పార్టీకి ఓటు వేయకుంటే అభివృద్ధి పనులు ఆపివేస్తామని బెదిరిస్తున్నారని వైసిపి నేతలు వినతిపత్రం అందించారు. ఓటుకు రూ.5 వేలు ఇవ్వగలమని చంద్రబాబు కూడా చెప్పారని గుర్తు చేశారు. టిడిపి గుర్తింపు రద్దు చేయాలని కోరారు.

Recommended Video

YSRCP To Win AP in 2019 : Survey Reports
తెలంగాణలో ఓటుకు నోటు

తెలంగాణలో ఓటుకు నోటు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.50 లక్షలు ఇస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని గుర్తు చేశారు. అక్కడ అవినీతికి పాల్పడినట్లే ఏపీలోను అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, కాబట్టి ఆ పార్టీ గుర్తింపు కోరారు.

10 మంది మంత్రులు మకాం వేసి అరాచకం

10 మంది మంత్రులు మకాం వేసి అరాచకం

టిడిపి ఓటర్లను ప్రలోభ పెడుతోందని, సుమారు పదిమంది మంత్రులు అక్కడే మకాం వేశారని, అరాచకాలు చేస్తున్నారని సీఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఎంపి వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. పలువురు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

కేంద్ర బలగాలను పంపించాలని..

కేంద్ర బలగాలను పంపించాలని..

నంద్యాలలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా కేంద్ర బలగాలను పంపించాలని సీఈసీని కోరినట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సీఈసీని కలిసిన వారిలో ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ తదితరులు ఉన్నారు.

నోటిఫికేషన్ రాకముందే..

నోటిఫికేషన్ రాకముందే..

నంద్యాల ఉప ఎన్నికలపై నోటిఫికేషన్ రాకముందే అభివృద్ధి పనుల పేరిట అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రజలను ప్రలోభ పెడుతోందని, అలాగే ఓట్లు వేయకుంటే రోడ్లపై నడవొద్దని బెదిరిస్తున్నారని వైసిపి నేతలు ఆరోపించారు. టిడిపికి ఓటు వేయకుంటే అభివృద్ధి చేయమని, మేం వేసిన రోడ్లపై నడవద్దని చెబుతున్నారని వారు విమర్శించారు.

English summary
YSR Congress Party on Monday complained CEC against Chandrababu Naidu Government over Nandyal bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X