ముందు తిట్టు- ఆ తరువాత కాకా పట్టు: చంద్రబాబు తెలిసిన రాజకీయం ఇదే: ఇంతోటి దానికి
Prashant Kishor: ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా అడుగుపెట్టారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. శనివారం సాయంత్రం ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా విజయవాడకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ భేటీపై మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తోన్నారు. గతంలో ఇదే చంద్రబాబు.. అదే ప్రశాంత్ కిశోర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తోన్నారు. ప్రశాంత్ కిశోర్ తోక కత్తిరిస్తానని, బిహార్ రాజకీయాలు ఏపీలో చెల్లనివ్వనంటూ చంద్రబాబు చేసిన విమర్శల వీడియోలు, కామెంట్లను ఇప్పుడు మళ్లీ ప్రస్తావిస్తోన్నారు.
మొదట తిట్టడం, ఆ తరువాత కాకా పట్టడం మాత్రమే చంద్రబాబుకు చేతనవుందనే విషయం మరోసారి రుజువైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ మొదలుకుని పవన్ కల్యాణ్, ప్రశాంత్ కిశోర్ వరకూ అందర్నీ ఇష్టానుసారంగా చంద్రబాబు తిట్టిన రోజులు ఉన్నాయి.
2014- 2019 మధ్యకాలంలో తొలుత బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు చంద్రబాబు. అప్పట్లో మోదీని ఆకాశానికెత్తేవారు. మోదీ వంటి నాయకుడి అవసరం దేశానికి ఉందంటూ అప్పట్లో ప్రశంసించారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తరువాత ఏ నోటితో మోదీని పొగిడారో అదే నోటితో మోదీపై విమర్శలు గుప్పించారు. నల్ల చొక్కా వేసుకుని మరీ ఢిల్లీలో ధర్నాలు చేశారు. మోదీని దించేస్తాం అంటూ హూంకరించారు.

కాంగ్రెస్ విషయంలోనూ చంద్రబాబు తీరు ఇంతే. కాంగ్రెస్‌పై చంద్రబాబు చేసిన విమర్శలన్నింటినీ పోగేస్తే- ఓ భారీ పుస్తకమే అవుతుంది. అలాంటి కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. తన చేతలతో రాహుల్ గాంధీకి శాలువా కప్పి, వీణను బహూకరించారు. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమితో చేతులు కలిపారు.
2019 ఎన్నికల తరువాత చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగింది. మళ్లీ ఎన్డీఏలో చేరడానికి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఇప్పటికీ బీజేపీతో పొత్తుకోసం ఆయన వెంపర్లాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ విషయంలోనూ అదే జరిగింది. గతంలో ప్రశాంత్ కిశోర్‌ను బిహార్ డెకాయిట్‌గా అభివర్ణించారు చంద్రబాబు. బిహార్ గుండాలకు ఏపీలో చోటు లేదని, వారి తోకలను కత్తిరిస్తానంటూ హెచ్చరించారు. కోడికత్తి, వివేకానందరెడ్డి హత్య.. ఇవన్నీ ప్రశాంత్ కిశోర్ వ్యూహాలేనని ఆరోపించారు. ఇప్పుడదే ప్రశాంత్ కిశోర్‌ను ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడం పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications