Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెగాసస్ పై వైసీపీ పులిస్వారీ-మమత ఆరోపణే ఆధారం-సొంత దర్యాప్తేదీ ? తేడా వస్తే రాజకీయ నష్టం

ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేశారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారని చెప్తున్న అస్పష్ట ఆరోపణలపై వైసీపీ ఆధారపడుతోంది. దీని ఆధారంగానే చంద్రబాబును టార్గెట్ చేయడంతో పాటు అసెంబ్లీ సభాసంఘంతో విచారణ చేయిస్తోంది. సొంత దర్యాప్తు సంస్ధలైన ఏసీబీ, సీఐడీ వంటి వాటిని వదలిపెట్టి అసెంబ్లీ సభాసంఘం విచారణకే పరిమితం కావడం వెనుక వైసీపీ రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.

పెగాసస్ పై మమత అస్పష్ట వ్యాఖ్యలు

పెగాసస్ పై మమత అస్పష్ట వ్యాఖ్యలు

ఏపీలో చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందా లేక చంద్రబాబు వ్యక్తిగతంగా దాన్ని కొనుగోలు చేశారా , అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, వ్యక్తులకు గానీ పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసే అవకాశం ఉందా అనేది స్పష్టం కావడం లేదు. అన్నింటికీ మించి మమతా బెనర్జీ అసలు చంద్రబాబుపై ఏం చెప్పారనే దానిపై వైసీపీలో కానీ, టీడీపీలో కానీ పూర్తి క్లారిటీ కూడా లేదు. అయినా పెగాసస్ ను చంద్రబాబు కొన్నారని నిర్ధారిస్తూ ఏపీ అసెంబ్లీలో గంటల తరబడి చర్చ పెట్టిన వైసీపీ చివరికి సభా సంఘం కూడా ఏర్పాటు చేసేసింది.

మమత వ్యాఖ్యలే ఆధారం

మమత వ్యాఖ్యలే ఆధారం


బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేశారని చెప్తున్న ఆరోపణలే ఆధారంగా చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కత్తులు నూరుతోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా ఇంత కీలక వ్యవహారంలో ప్రభుత్వం కేవలం మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్ని ఆధారంగా చేసుకుని ఇంత కీలక నిర్ణయాలు తీసుకోవడమేంటన్న చర్చ జరుగుతోంది. రేపు మమతా బెనర్జీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించారనో, లేక తన వ్యాఖ్యలు అపార్ధం చేసుకున్నారనో, చంద్రబాబు ప్రమేయాన్ని తాను చెప్పలేదనో కొట్టిపారేస్తే అప్పుడు వైసీపీ విమర్శల పాలవడం ఖాయం.

కనీస దర్యాప్తు లేకుండా

కనీస దర్యాప్తు లేకుండా

మమతా బెనర్జీ ఏపీలో ఓ రాజకీయ నేతపై చేసిన ఆరోపణల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే, రాజకీయంగా తమకు లబ్ది జరుగుతుందని భావిస్తే తమ సొంత దర్యాప్తు సంస్ధలైన ఏసీబీ, సీఐడీ సాయంతో విచారణ చేయించే అవకాశం ఉండనే ఉంది. అయినా పెగాసస్ వంటి కీలక అంశంపై కనీస దర్యాప్తు లేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వైసీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న విమర్శలు డేంజర్ గేమ్ ను తలపిస్తున్నాయి. ముఖ్యంగా కనీస దర్యాప్తు లేకుండా, ప్రాధమిక ఆధారాలు కూడా లేకుండా ఏకంగా సభాసంఘం ఏర్పాటు చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పదలచుకుందనే అంశం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు తావిస్తోంది. రేపు సభాసంఘం చంద్రబాబు పెగాసస్ కొన్నారని నిర్ధారిస్తే దానికి శాస్త్రీయ ఆధారాలు అక్కర్లేదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

వైసీపీ పులి మీద స్వారీ

వైసీపీ పులి మీద స్వారీ


పెగాసస్ విషయంలో మమతా బెనర్జీ ఆరోపణల్ని ఆధారంగా చేసుకుని వైసీపీ ఆడుతున్న పులి మీద స్వారీ ఏమాత్రం తేడా వచ్చినా రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించడం ఖాయం. ఎందుకంటే ఇప్పటివరకూ మమత ఆరోపణలపై ఎలాంటి ప్రాధమిక దర్యాప్తు జరగలేదు, ప్రాథమిక ఆధారాలు కూడా లభించలేదు, అయినా ప్రభుత్వం రాజకీయంగా తమ చేతుల్లో ఉన్న అసెంబ్లీ కమిటీతో దర్యాప్తు చేయించాలనే నిర్ణయానికి వచ్చింది. తద్వారా గతంలో అమరావతి విషయంలో మంత్రివర్గ సభాసంఘం నివేదికలు ఎలా తేలిపోయాయో ఇప్పుడు ఈ నివేదిక కూడా పసలేనిదిగా తేలిపోయే అవకాశాలు లేకపోలేదు. దానికి బదులుగా ఇప్పటికైనా సమగ్ర దర్యాప్తు చేయించి అసలు వాస్తవాలు బయటపెడితే ప్రభుత్వ చిత్తశుద్ధి కూడా బయటపడే అవకాశముంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+