వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్ళనానికి ఎంఏల్ సి టిక్కెట్లు, పిడిఎఫ్ కు జగన్ మద్దతు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ ఏ కోటా ఎంఏల్ సి అభ్యర్థులను ప్రకటించింది. ఆళ్ళనాని, గంగుల ప్రభాకర్ రెడ్డిని తన అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది. మూడు నియోజకవర్గాల్లో పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతివ్వాలన

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంఏల్ఏ కోటా ఎంఏల్ సి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఈ మేరకు ఆళ్ళనాని, గంగుల ప్రభాకర్ రెడ్డిని ఎం ఏల్ సి ఎన్నికల్లో రంగంలోకి దించనున్నట్టు ప్రకటించింది.మూడు నియోజకవర్గాల్లో పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతివ్వాలని జగన్ పార్టీ నిర్ణయం తీసుకొంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంఏల్ఏ కోటా ఎంఏల్ సి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత జగన్ సీనియర్లతో విస్తృతంగా చర్చించారు.

ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆళ్ళనానిని రంగంలోకి దించారు. రాయలసీమ నుండి ఇటీవలే టిడిపిని వీడి వైసిపిలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డిని బరిలో నిలపాలని పార్టీ నిర్ణయించింది.

Ysrcp decided Alla Nani and Gangula Prabhakar reddy for mlc elections

మరో వైపు పిడిఎఫ్ ఎంఏల్ సి లు ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వర్ రావు తదితరులు గురువారం నాడు జగన్ ను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. పట్టభద్రులు, టీచర్ ఎంఏల్ సి ఎన్నికల్లో పిడిఎఫ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.

అలాగే రాయలసీమ ఈస్ట్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో పిడిఎఫ్ అభ్యర్థి యండవల్లి శ్రీనివాస్ రెడ్డి , టీచర్స్ నియోజకవర్గంలో విటపు బాలసుబ్రమణ్యానికి వైఎస్ జగన్ మద్దతు తెలిపారు.

ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో అజయ్ శర్మకు మద్దతు ప్రకటించింది వైసిపి.ఈ మూడు నియోజకవర్గాల్లో పిడిఎఫ్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జగన్ ఆ పార్టీ శ్రేణులను కోరారు.

English summary
Ysrcp decided Alla Nani and Gangula Prabhakar reddy for mlc elections.gangula prabhakar reddy joined in ysrcp two weeks back .jagan party decided support to pdf candidates in mlc elections on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X