ఆ పదవి మాకే.. మీ విజ్ఞత: చంద్రబాబుకు జగన్ పార్టీ
హైదరాబాద్: సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోరుతోంది. బుధవారం పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో అనేక అంశాలు చర్చించారు.
సమావేశం అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ... సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి రావాలన్నారు. అది అధికార పక్షం విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. అది తమకే ఇవ్వాలన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. తాము ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. ప్రభుత్వం చేసే ప్రజాహితానికి సహకరిస్తామని, ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తామన్నారు.

సమన్వయకర్తలు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్తలుగా శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలను ఎంపిక చేశారు.
డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు
డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఉప్పులేటి కల్పన, కొడాలి నాని, భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, రాజన్న దొర, ముత్యాలయనాయుడులు ఎంపికయ్యారు. కాగా, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనకు పార్టీ విప్ వద్దని అధ్యక్షుడికి చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications