'మూడు రోజుల్లో ఏం చర్చిస్తారు? అసెంబ్లీ మూడు వారాలకు పెంచాల్సిందే'
విజయవాడ : అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడు రోజులకే పరిమితం చేయడం పట్ల ప్రతిపక్ష వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడడంతో.. సమావేశాల గడువును పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తోంది వైసీపీ.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించడానికి మూడు రోజుల సమయం ఏమాత్రం సరిపోదనేది వైసీపీ వాదన. కనీసం ఏ ఒక్క అంశంపై కూడా చర్చను పూర్తి చేయడానికి ఈ మూడు రోజుల గడువు సరిపోదని, కాబట్టి అసెంబ్లీ సమావేశాల గడువును మూడు వారాలకు పెంచాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే విషయంపై చర్చించడానికి బుధవారం ఉదయం లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ శాసనసభా పక్ష భేటీ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాలను మూడు వారాలకు పెంచాలన్న డిమాండ్ తో పాటు సమావేశాల్లో అనుసరించాల్సిన పార్టీ వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications