విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీకి సంకటంగా గంటా రాజీనామా- ఆమోదంపై మల్లగుల్లాలు- ఏం చేసినా ఇబ్బందే ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో విశాఖ స్టీల్‌ ప్లైవేటీకరణ వ్యవహారం ఎంత వద్దనుకున్నా వైసీపీ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో నిరసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ తాజాగా పార్లమెంటులో స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వరం పెంచుతోంది. అయితే ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు కూడా అర్ధాంతరంగా వాయిదా పడిపోవడంతో ఇక క్షేత్రస్ధాయిలోనే తేల్చుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ చేసిన రాజీనామాను ఆమోదించాలా వద్దా అనే విషయంలో మాత్రం వైసీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది.

 గంటా శ్రీనివాస్‌ రాజీనామాస్త్రం

గంటా శ్రీనివాస్‌ రాజీనామాస్త్రం

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగరంలో కార్మికులు ఆందోళనకు దిగగానే ముందుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన టీడీపీ నేత గంటా శ్రీనివాస్‌.. అన్నంత పనీ చేశారు. ముందు స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా విశాఖ స్టీల్‌ కోసం అన్నట్లుగా పంపిన రాజీనామా లేఖపై విమర్శలు రావడంతో ఆ తర్వాత మరోసారి స్పీకర్‌ ఫార్మాట్‌లోనే లేఖను పంపారు. దీంతో ఆయన రాజీనామా ఆమోదం విషయంలో నిర్ణయం అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేతుల్లోకి వెళ్లిపోయింది. కానీ ఆయన రాజీనామా లేఖ పంపి నెల రోజులవుతున్నా ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

 గంటా రాజీనామాపై వైసీపీ మల్లగుల్లాలు

గంటా రాజీనామాపై వైసీపీ మల్లగుల్లాలు

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ చేసిన రాజీనామాను మామూలు పరిస్ధితుల్లో అయితే వైసీపీ సర్కారు సునాయాసంగా అమోదించి ఉప ఎన్నికకు సిద్ధమైపోయేది. కానీ ఇప్పుడు ఆయన చేసిన రాజీనామా తీవ్ర భావోద్వేగాలతో కూడుకున్న విశాఖ స్టీల్‌ వ్యవహారంపై కావడంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది. గంటా తాను రాజీనామా చేసిన తర్వాత వైసీపీ నేతలు కూడా రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని నాన్‌-పొలిటికల్‌ జేఏసీ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే మరో అడుగు ముందుకేసి అచ్చెన్నాయుడు తరహాలోనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే వారిపై పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపిస్తామన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం రాజీనామాలతో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగదని బహిరంగంగానే చెప్పుకుని తిరుగుతున్నారు.

 రాజీనామా ఆమోదించాలని స్పీకర్‌ను కోరిన గంటా

రాజీనామా ఆమోదించాలని స్పీకర్‌ను కోరిన గంటా

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆమోదం కోసం తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ ఇవాళ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖ పంపినందున ఆలస్యం చేయకుండా ఆమోదించాలని కోరారు. రాజీనామాలతోనే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగుతుందని బహిరంగంగానే చెప్తున్న ఆయన. ఇదే విషయాన్ని స్పీకర్‌కు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రాజీనామా ఆమోదం విషయంలో అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ తమ్మినేని గంటాకు చెప్పి పంపినట్లు సమాచారం.

 గంటాపై వైసీపీకి ముందునుయ్యి, వెనుక గొయ్యి

గంటాపై వైసీపీకి ముందునుయ్యి, వెనుక గొయ్యి

గంటా శ్రీనివాస్‌ రాజీనామా విషయంలో ఆయన్ను ముందుగా అంచనా వేయడంలో విఫలమైన వైసీపీ నేతలు.. ఆ తర్వాత ఆయనకు మద్దతు పెరుగుతున్న క్రమంలో తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అవి కాస్తా బెడిసి కొట్టడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తుత్తి రాజీనామా గంటలంటూ ట్వీట్లు పెట్టి గంటాను టార్గెట్‌ చేశారు. అది కూడా ఫలించకపోవడంతో ఇప్పుడు గంటా విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయంలో పార్టీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గంటా రాజీనామాను ఆమోదిస్తే ఆయన స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంలో ఛాంపియన్‌గా నిలుస్తారు. అంతే కాదు వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలకూ ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్ధితి వస్తుంది. అలాగని గంటా రాజీనామా ఆమోదించకపోతే భవిష్యత్తులో వైసీపీ దోషిగా నిలబడాల్సి వస్తుంది. తాము రాజీనామాలు చేయకుండా, గంటా చేసిన రాజీనామాను ఆమోదించలేదనే అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుంది. దీంతో గంటా విషయంలో వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది.

English summary
ysrcp government in andhra pradesh seems to be mulling over accepting tdp mla ganta srinivas resignation on vizag steel. ganta already met speaker tammineni and asked him to accept his resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X