వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్ర సృష్టించినా.. వివాదాలు కొని తెచ్చుకున్నా: మంచి సీఎం అయ్యారా: అదే జగన్ మార్క్ పాలన

|
Google Oneindia TeluguNews

అమరావతి: తండ్రి మరణించిన నల్లకాలువ వద్ద భావోద్వేగంతో ఇచ్చిన మాట ఆ యువకుడి జీవితాన్నే మలుపు తిప్పింది. మాటకోసం ఢిల్లీనే ఢీకొట్టారు. రాజకీయ అనుభవం లేకున్నా అనుభవజ్ఞులకు నిద్రలేకుండా చేశాడు. ఇచ్చిన మాటకోసం చిరునవ్వుతోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఓదార్పు యాత్రతో మానవతావాదిగా కనిపించాడు. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీని కూకటివేళ్లతో పెకలించేశాడు. ఒకే ఒక్కడు ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పిన ధీరుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మే 30 ,2019 కొత్త శకానికి పునాది పడిన రోజు. సరిగ్గా ఏడాది క్రితం అదే ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసిన రోజు.

Recommended Video

వైఎస్ జగన్ ఏడాది పాలన... మంచి సీఎం అయ్యారా ?

 వైఎస్ జగన్ ఏడాది పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాం మాధవ్.. బీజేపీ రాష్ట్ర నాయకులకు షాక్ వైఎస్ జగన్ ఏడాది పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాం మాధవ్.. బీజేపీ రాష్ట్ర నాయకులకు షాక్

 నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ...

నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ...

ఎన్నో ఆశలతో కోట్ల ఓట్లు పోలయ్యాయి. రికార్డు స్థాయిలో సీట్లు దక్కాయి. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ సరిగ్గా ఏడాది క్రితం సీఎంగా ప్రమాణం స్వీకారం చేసి ఇచ్చిన తొలి మాట ఆరునెలలులోగా మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటా. నిజంగా జగన్ మంచి ముఖ్యమంత్రి అయ్యారా..? అయ్యారా అంటే దీనికి ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే సంక్షేమంకు తొలి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిపై అప్పుడప్పుడు స్పందిస్తూ మేనిఫెస్టోకే ప్రాధాన్యత ఇస్తూ న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తింటూ రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన మిస్టర్ కూల్‌గా ఉంటూ కళ్లముందే కాలం కరిగిపోయిందా అనే విధంగా ఏడాది గడిచిపోయింది. నేను విన్నాను.. నేను ఉన్నాను... అనే స్లోగన్‌తో నాడు వైసీపీ అధినేతగా వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. ఓవైపు రాజకీయాలను అవపోసన పట్టిన చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో జగన్‌పై నిప్పులు చెరుగుతూ ప్రచారం చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం వైసీపీని చరిత్రలో ఎన్నడూ లేనంతగా అఖండ మెజార్టీతో గెలిపించారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వానికి 23 సీట్లు మాత్రమే కట్టబెట్టారు. ఇక పవన్ కళ్యాణ్‌ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిపాలవగా... ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన రాపాక ఒక్కరే విజయం సాధించారు. ఇక జగన్ ప్రమాణ స్వీకారం చేశాక తన తొలి ప్రాధాన్యత సంక్షేమమే అని చెప్పుకొచ్చారు.

 చెప్పాడంటే చేస్తాడంతే అనే ట్యాగ్....

చెప్పాడంటే చేస్తాడంతే అనే ట్యాగ్....

ప్రచారంలో ఉండగా వైసీపీ ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టిందో వాటికే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రెండు పేజీలతో కూడిన నవరత్నాలను పూర్తి చేసి మళ్లీ 2024లో ఎన్నికలకు వెళతామని చెప్పారు అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం జగన్. సాధారణంగా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటేనే మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయడం జరుగుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మేనిఫెస్టోలోని అంశాలపై దృష్టి సారించి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చారు. హామీలు అమలు చేసేందుకు విపక్షాలైన టీడీపీ జనసేనలు ఆరునెలల సమయం ఇచ్చాయి. కానీ అంతకుముందే నవరత్నాల్లో ఏదైతే పొందు పర్చారో ఆ హామీలను నెరవేర్చారని స్వయంగా సీఎం చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలుకు మాత్రం ఎక్కడా బ్రేక్ వేయలేదు. తేదీలు చెప్పి ఈ పథకాలను అమలు చేస్తుండటంపై ప్రతిపక్షాలే కాదు కేబినెట్ మంత్రులు కూడా షాక్‌కు గురవుతున్న పరిస్తితి నెలకొంది. అందుకే "చెప్పాడంటే.. చేస్తాడంతే" అనే ట్యాగ్‌లైన్‌ను తన కేబినెట్ మంత్రులు తనకు ఇచ్చారు.

 సంక్షేమ పథకాలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

సంక్షేమ పథకాలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వం హిస్టారికల్ డెసిషన్. అమ్మ ఒడి స్కీమ్ ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం తమ పిల్లలను స్కూలుకు పంపించిన ప్రతి తల్లి ఖాతాలో డబ్బులు వేసి ప్రోత్సహిస్తున్నారు జగన్. ఇది ఒకరంగా భవిష్యత్తులో దేశంకు మ్యాన్‌పవర్ ఇవ్వడమే . పేదల పిల్లలను కూడా ధనికుల పిల్లలతో ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా సమానత్వం కల్పిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత రజకులు, టెయిలర్స్, బార్బర్స్, ఆటో డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్, వీళ్లకు ఫైనాన్స్ హెల్ప్ అనేది గత ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదు. ప్రత్యేకించి కరోనా సమయంలో వారికి చేసిన ఈ సహాయం వారెప్పుడూ మరవలేరు. ఆరోగ్య శ్రీ సంస్కరణలు తీసుకొచ్చారు.వెయ్యి రూపాయలు వైద్యం దాటిన ప్రతి ఒక్కరికీ కుల, మత పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఆపరేషన్ జరిగితే రెస్ట్ పీరియడ్‌లో ఇన్‌సెంటివ్స్ ఇస్తామన్నారు..క్యాన్సర్ డయాలసిస్, పెరాలసిస్, పేషంట్స్‌కు పెన్షన్ ఇవ్వడం ద్వారా ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా తన తండ్రి కంటే నాలుగడుగులు ముందుకేసి నిరూపించాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.జగన్ దృష్టి మొత్తం విద్య వైద్య వ్యవసాయంపైనే ఉంది. ఈ మూడు కూడా పునరుత్పత్తి పద్దతిలో చూడాలి. ఈ మూడు రంగాల్లో చాలా స్ట్రాటజిక్‌‌గా వెళుతున్నారని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.అధికారంలోకి వచ్చిన తొలి క్యాబినెట్లోనే ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనం చేయడం, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 కరోనాపై విమర్శలు కానీ...

కరోనాపై విమర్శలు కానీ...

అనుభవం లేదు.. అవినీతి కేసులు ఎదుర్కొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వచ్చిన జగన్‌పై ప్రతిపక్షాలు సంధించిన అస్త్రాలు ఇవి. అయినా బెదరలేదు. విశ్వసనీయత, మాట తప్పను మడమ తిప్పను అనే నినాదంతో ఏడాది పాలన పూర్తి చేశాడు. ఆర్థికంగా ఖాళీ అయిన ఖజానాతోనే తన ఎన్నికల మేనిఫెస్టోను 90 శాతం పూర్తి చేశాడు. ఏ ఒక్క హామీ నుంచి వెనకడుగు వేయలేదు. మధ్యలో ఈ ఏడాది కాలంలో ఎన్నో విపత్తులు మరెన్నో వైపరీత్యాలు. కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసినట్లే ఏపీకి భారీగా నష్టం చేసింది.తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ పలు విపత్తులను ఎదుర్కొనడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కోవిడ్-19పై డే వన్ నుంచి చాలా ఓపెన్‌గా ఉన్నారు. సిస్టమాటిక్‌గా ఉన్నారు. టెస్టుల సంఖ్యలో దేశంలోనే ఏపీ మూడవ స్థానంలో నిలిచింది. కరోనా గురించి జగన్ చెప్పిన వాస్తవాల మీద రాజకీయ విమర్శలు వచ్చినా... ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రధాని మోడీతోపాటు పలువురు రాష్ట్ర సీఎంలు, మేధావులు సైతం జగన్ మాటలే చెప్పాల్సి వచ్చిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.జగన్ రూటే సపరేటు అన్నట్లుగా కరోనాను జగన్ ఎదుర్కొన్న తీరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్.

 అనుభవం లేకున్నా అవినీతికి అవకాశం లేకుండా...

అనుభవం లేకున్నా అవినీతికి అవకాశం లేకుండా...

ఇక అవినీతి విషయంలోను వేలెత్తి చూపలేని పరిస్థితి. రాష్ట్రాన్ని దోచేస్తారు అనే నినాదంకు సమాధానమే అవినీతి రహిత పాలన రివర్స్ టెండరింగ్. దాదాపు రూ.1200 కోట్లు ఒక్క ఏడాదిలోనే ఆదా చేశారు. అవినీతి ఎవరైనా చేస్తే ఫిర్యాదు చేయండంటూ సీఎంఓ కార్యాలయంలోనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన ఘనత. దేశంలోనే దిశా చట్టం అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. అన్నింటా అందరికీ అవకాశం దక్కేలా 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. సంక్షేమ జపంతోనే ఏడాది కాలం పూర్తి చేశారు. అభివృద్ధి జాడ మాత్రం సున్నా.ఈ ఏడాది కాలంలో సంక్షేమంలో తిరుగులేని నేతగా నిలిచిన జగన్ అభివృద్ధిలో మాత్రం అడుగు ముందుకు వేయలేకపోయారు. అమరావతి కరకట్ట మీద ఉన్న ప్రజావేదిక కూల్చివేతతో మొదలై మళ్లీ అక్కడే ఆగిపోయారు. దానికి కారణాలు అనేకం.

రాజధాని.. పోలవరం ..అప్పులు

 రాజధాని తరలింపుపై విమర్శలు

రాజధాని తరలింపుపై విమర్శలు

రాజధాని మార్కు విషయంలో గందరగోళం ఏర్పడింది. మూడు రాజధానులంటూ తీసుకున్న నినాదం వివాదాస్పదమైంది. 2021 నాటికి పూర్తి చేస్తానన్న పోలవరం డెడ్‌లైన్ పొడిగిస్తూనే ఉన్నారు. పోలవరంకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులను పూర్తిస్థాయిలో సాధించలేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కానీ వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగాలు మినహా మరేవీ ముట్టుకోలేకపోయారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు తనకు తొలి ప్రాధాన్యత అని చెబుతూ వస్తున్నా నిధుల కష్టాలతో వెనకడుగు వేస్తున్నారు. ఏడాది కాలంలో ఒక్క పెద్ద పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు. ఏడాది కాలంలో వైసీపీ సర్కార్ చేసిన అప్పు రూ.87వేల కోట్లు. రూ.41 కోట్లుగా ఉన్న రెవిన్యూ లోటు 2019-20 నాటికి రూ.70 వేల కోట్లకు చేరింది.పూర్తిగా సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తూ విశాఖ అభివృద్ధి గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారు. పరిశ్రమలు పెట్టుబడుల కోసం ఒకటో రెండో సమావేశాలు మినహా సీఎం స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రయత్నాలు కనిపించలేదు.

 జగన్ మార్క్ పాలన

జగన్ మార్క్ పాలన

అమ్మఒడి పథకం ద్వారా సీఎం జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టిని ఆకర్షించారు. ఆరోగ్య శ్రీ సంస్కరణలు జగన్‌లో మరో వైయస్‌ను కనిపించేలా చేసింది. న్యాయపరంగా రాజకీయంగా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఇంగ్లీషు మీడియం స్కూళ్ల విషయంలో జగన్ పట్టుదల మాత్రం వీడలేదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపైనా ఐఏఎస్/ఐపీఎస్‌ల శిక్షణలోనూ పాఠ్యాంశంగా మారింది. పవర్ ప్రాజెక్టుల అగ్రిమెంట్లు, పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు, ప్రభుత్వ బిల్లులనే తిరస్కరిస్తారా అంటూ శాసనమండలి రద్దు వంటివి జగన్‌లోని మొండితనం, తెగింపు పట్టుదలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న మద్యం ధరలు పెంచడం, దుకాణాలను తగ్గించడం జగన్ సాహసానికి నిదర్శనం. అప్పు తెచ్చైనా సరే చెప్పిన తేదీకి సంక్షేమ పథకాలు అమలు చేయడం జగన్ మార్క్‌ పాలనకు నిదర్శనంగా నిలిచిపోతుంది. ఇక ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించి విపక్షాలు మాట్లాడకుండా చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం దేశం దృష్టిలో పడింది.

 ఏకపక్ష నిర్ణయాలు న్యాయస్థానాల మొట్టికాయలు..

ఏకపక్ష నిర్ణయాలు న్యాయస్థానాల మొట్టికాయలు..

ప్రజల సంక్షేమంలో జగన్ ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించినా పరిపాలన వ్యవహారంలో తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం న్యాయం చట్టం ముందు నిలబడలేకపోతున్నాయి. 12 నెలల పాలనలో 64 కేసుల్లో తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. తను ప్రవేశపెట్టిన బిల్లులను తిరస్కరించినందుకు ఏకంగా శాసనమండలినే రద్దు చేస్తూ సిఫారసు చేశారు. ప్రభుత్వంతో చర్చించకుండా కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయడాన్ని సహించని సీఎం ఎస్‌ఈసీని ఏకంగా కులం పేరుతో చంద్రబాబు మద్దతుదారుడి పేరుతో నిందించారు. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించారు. కానీ న్యాయస్థానం ఆవిధానాన్ని తప్పుబట్టింది. తన కార్యాలయ ఆదేశాలు పాటించలేదంటూ ఏకంగా సీఎస్‌నే బదిలీ చేసిన ఘనత జగన్‌ది. 25 మంది ఎంపీలను గెలిపించండి ప్రత్యేక హోదా తెస్తానంటూ నాడు నినదించిన జగన్ ఇప్పట్లో ఆ హోదా రాదనే విషయాన్ని పరోక్షంగా తేల్చి చెప్పేశారు. కేంద్రంతో శతృత్వం లేకున్నా అంత దోస్తానా కూడా జగన్‌కు లేదు. ఈ ఏడాది కాలంలో కేంద్రం ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చింది ఏదీ లేదు. అయితే నాటి జగన్‌కు నేటి జగన్‌కు ఒక్కటే తేడా. ప్రతిపక్ష నేతగా విరుచుకుపడిన జగన్... ఇప్పుడు మిస్టర్ కూల్‌గా కనిపిస్తున్నారు. మీడియా చాటునుంచి కాకుండా ప్రజల మధ్యనుండే తన పాలన సాగుతుందని గ్రాఫిక్స్‌లతో మాయమాటలతో తన పాలన ఉండదని ధైర్యంగా చెబుతున్నారు.

 వన్‌ మ్యాన్ ఆర్మీ.. పార్టీ ప్రభుత్వం రెండు ఆయనే

వన్‌ మ్యాన్ ఆర్మీ.. పార్టీ ప్రభుత్వం రెండు ఆయనే

2012లో పార్టీని ప్రారంభించింది జగన్ ఒక్కరే. ఆయన వెంట నిలిచింది తల్లి మాత్రమే . మధ్యలో అనేక మంది నేతలు చేరినా ప్రతిపక్షనాయకుడిగా వ్యవహరించినా సుదీర్ఘ పాదయాత్ర చేసినా ముఖ్యమంత్రిగా ఎదిగినా పార్టీలోనూ, నేడు ప్రభుత్వంలోను జగన్ వన్‌మ్యాన్ ఆర్మీ. అక్కడక్కడా కొంతమంది నేతలు స్వయం ప్రకాశంతో ఎదిగినా... ఒక్క ఛాన్స్ జగన్‌కు ఇవ్వాల్సిందే అన్న సంకల్పంతో 151 సీట్లు కట్టబెట్టి వైయస్ వారసుడిపైనా తమ అంచనాలు ఏమిటో ప్రజలు ఓటు ద్వారా చాటి చెప్పారు. దాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ చేస్తున్న ప్రయాణాల్లో ఎన్నో ఆటుపోట్లు కనిపిస్తాయి. ఐదుగురు ఉపముఖ్యమంత్రులను నియమించి ఏ వర్గాన్ని విస్మరించడం లేదనే సంకేతాలు ఇచ్చారు. జగన్ గెలుపునకు కారణమైన పక్కా కులసమీకరణాలు అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగిస్తున్నారు. కేబినెట్ కూర్పు ఆ కోవలోకే వస్తుంది. మీ పదవులు రెండున్నరేళ్లే అంటూ వారికి తొలిరోజునే డెడ్‌ లైన్ ఫిక్స్ చేసే సాహసం జగన్ మినహా ఏ సీఎం చేయలేదు. పార్టీ వ్యవహారాలపై పట్టుకోల్పోతున్నారనే ప్రచారం సాగుతున్నా... తన పట్టు జారకుండా ఎంతటి కఠిన నిర్ణయాలకైనా తెగించే లక్షణం జగన్ సొంతం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఎన్ని విమర్శలు వచ్చినా పరోక్షంగా వారికి సహకారం అందిస్తున్నా... ముఖేష్ అంబానీలాంటి వారిని తన ఇంటికి రప్పించుకుని రాజ్యసభ సీటు ఇవ్వండి అంటూ వారితో అడిగించుకోవడం ద్వారా జగన్ చాణక్యం ప్రత్యర్థులకు షాక్ ఇచ్చింది. బీజేపీతో సఖ్యతతో ఉండటం ద్వారా ఒక రకంగా ప్రత్యేక హోదా లాంటి అంశంలో అటు టీడీపీని ఇటు జనసేనను జగన్ ఫిక్స్ చేసేశారు.

 నాడు చంద్రబాబు చేసిందే నేడు జగన్ చేస్తున్నారా..?

నాడు చంద్రబాబు చేసిందే నేడు జగన్ చేస్తున్నారా..?

ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా చంద్రబాబు నాడు కొట్టిన దెబ్బకు ఇప్పుడు జగన్ ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అయితే వారి మెడలో పార్టీ కండువా కప్పరు.. వారిని అధికారికంగా పార్టీలో చేర్చుకోరు.. అలాగని వారు టీడీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగరు. ఇలా రాజకీయంగా నిత్యం ప్రజల్లో ఉండే సంక్షేమ నిర్ణయాలతోను ప్రత్యర్తి పార్టీలకు ప్రజలకు దగ్గరయ్యే అవకాశం లేకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో మతపరమైన అంశాలతో సెంటిమెంట్లను రగిల్చే ప్రయత్నాలను ప్రత్యర్థి పార్టీలు చేశాయి. ఆసమయంలో జగన్ వ్యూహాత్మకంగా వేసిన వెనకడుగులు మరింత డ్యామేజ్ కాకుండా నిలిపాయి. కానీ కుల రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్ అయిన ఏపీలో సున్నిత అంశాలతో జగన్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు ప్రతిపక్షాలు నిత్యం పొంచి ఉన్నాయి. కొన్ని ఆవేశ పూరిత నిర్ణయాలు సహనం లేని ఆదేశాలు హద్దులు దాటుతున్న అభిమానుల భక్తి జగన్‌కు నెగిటివ్‌గా మారుతున్నాయి. మొదటి ఏడాది మొత్తం బాలారిష్టాలు ఎదుర్కొన్న జగన్... తన రెండో ఏడాది పాలనలో ఏరకంగా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.

English summary
The YCP govt in Andhra Pradesh had completed its one year of Administration. In this backdrop though welfare schemes were on board but when it came to development there is a mixed talk on Jagan govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X