Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఎమ్మెల్యే తీరుపై వైసీపీ హైకమాండ్ సీరియస్ - ముఖ్య నేతలతో ఆరా..!!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినాయకత్వం అప్రమత్తమవుతోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న సీఎం జగన్ ఏ ఒక్క నియోజకవర్గాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేరు. 2019 ఎన్నికల్లో వైసీపీ నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు, కడప, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ప్రతిపక్షాలకు ఛాన్స్ లేకుండా పోయింది. కర్నూలు - నెల్లూరు జిల్లాల్లో పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టిన వైసీపీ నాయకత్వం ఇప్పుడు విజయనగరం జిల్లా పైన ఫోకస్ పెట్టింది.

జిల్లాలో పార్వతీపురం నియోజకవర్గంలో పరిస్థితులపైన వస్తున్న నివేదికలతో హైకమాండ్ సీరియస్ గా ఉంది. అక్కడి ఎమ్మెల్యే తీరు.. పార్టీ పరిస్థితిపైన జిల్లా ముఖ్య నేతలు..ఇంఛార్జ్ ల నుంచి సమాచారం సేకరిస్తోంది. దీంతో, ఇప్పుడు ఈ జిల్లాలో వైసీపీ నాయకత్వం ఏం చేయబోతోందనే ఉత్కంఠ మొదలైంది.

వైసీపీ కంచుకోటకు బీటలు వారుతున్నాయంటూ..

వైసీపీ కంచుకోటకు బీటలు వారుతున్నాయంటూ..

విజయనగరం జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు మరోసారి గెలవాల్సిందేనంటూ జిల్లా మంత్రులు.. పార్టీ జిల్లా బాధ్యులకు ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అందులో టీడీపీ కంచుకోటగా ఉన్న పార్వతి పురం నియోజకవర్గం మరోసారి చేయి దాటే ప్రమాదం ఉందనే సమాచారంతో పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది.

2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్ధిగా జమ్మాన ప్రసన్న కుమార్ పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చిరంజీవులు చేతిలో ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జోగారావు వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికలకు ముందు పార్వతీపురం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పరీక్షిత్ రాజు.. జమ్మాన ప్రసన్నకుమార్ మధ్య విభేదాలు ఉండేవి, తరువాత సమిసిపోయాయి. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పరీక్షిత్ రాజుతో జోగారావు సఖ్యతగా ఉండేవారు. జమ్మానకు మద్దతు ఉన్నా.. ఎన్నికల నిర్వహణలో వెనుకబడి ఉన్నారు. దీంతో.. జోగారావుకు టికెట్ కోసం స్థానిక నేతలు సిఫార్సు చేసారు. జోగారావు గెలిచారు.

ఎమ్మెల్యే పై ఫిర్యాదుల వెల్లువ..

ఎమ్మెల్యే పై ఫిర్యాదుల వెల్లువ..

ఎమ్మెల్యే జోగారావు పై గతంలోనూ అనేక ఫిర్యాదులు తాడేపల్లికి చేరాయి. జిల్లాకు చెందిన ఎస్టీ మహిళ పుష్పశ్రీ వాణీకి సీఎం జగన్ డిప్యూటీ సీఎం హోదా కేటాయించారు. పుష్పశ్రీవాణీ పేరును దుర్వినియోగం చేస్తూ అనేక పనులు చేసారని పార్టీ నేతలే చెబుతుంటారు. దీంతో, జోగారావును డిప్యూటీ సీఎంగా ఉన్న సమయం నుంచే పుష్ఫశ్రీవాణీ పక్కన పెట్టారు.

జిల్లా సమీక్షా సమావేశాల్లోనూ జోగారావు తీరు పైన ఫిర్యాదులు ఉన్నాయి. సీనియర్ నేత బొత్సాను అందరి సమక్షంలో ప్రశ్నించటం..ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించటం పైన ఇప్పటికే తాడేపల్లికి ఫిర్యాదులు అందాయి. మంత్రి బొత్సాతో పాటుగా పరీక్షిత్ రాజు కూడా ఇప్పుడు జోగారావు పైన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జోగారావు కు స్థానిక నేతల మద్దతు లేకుండా టిక్కెట్ దక్కే అవకాశం లేదని..స్థానికంగా ఉన్న ముఖ్య నేతలు సహకరించే అవకాశాలు లేవని ప్రచారం సాగుతోంది. వైసీపీ అధినాయకత్వం కూడా ఇప్పటికే ఈ నియోజకవర్గం..ఎమ్మెల్యే తీరు పైన జిల్లా నేతల నుంచి నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం.

రేసులో ముగ్గురు అభ్యర్దులు..

రేసులో ముగ్గురు అభ్యర్దులు..

పార్వతీపురం నుంచి ఈ సారి ముగ్గురు టికెట్‌ను ఆశిస్తున్నారు. అందులో జమ్మాన ప్రసన్న ప్రస్తుతం టిడ్కో ఛైర్మెన్‌గా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే జైమణి సవరపు, బొబ్బలి జెడ్పీటీసీ అభ్యర్థి శాంతకుమారిలు ఉన్నారు. శాంతకుమారి భర్త విద్యుత్ శాఖలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకు అక్కడి ప్రజలతో మంచి సంబంధాలున్నాయని చెబుతున్నారు.

పార్వతీపురంలో కొప్పల వెలమ ,తూర్పు కాపులదే డిసైడింగ్ ఫ్యాక్టర్. అయితే ఈ రెండు సామాజిక వర్గాలు అలజంగి జోగారావుకు టికెట్ ఇస్తే తాము మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశాయి. జోగారావు ఎమ్మెల్యే అయ్యాక ఈ రెండు సామాజిక వర్గాలను దూరం పెట్టటంతో వారు సహకరించే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది.

వచ్చే ఎన్నికల కోసం సర్వేలు చేయిస్తున్న ముఖ్యమంత్రికి ఇప్పటికే ఇక్కడ పరిస్థితిపై పూర్తి సమాచారం అందిందని తెలుస్తోంది. టికెట్ ఖరారు వేళ.. జిల్లా ముఖ్యనేత బొత్సా, పరీక్షిత్ వంటి వారు వ్యతిరేకంగా చెప్పటం ఖాయంగా కనిపిస్తోంది. సర్వే రిపోర్టులు..జిల్లా నేతల నివేదికలు టిక్కెట్ ఖరారులో కీలకం కానున్నాయి.

ఒకవేళ వైసీపీ నుంచి జోగారావుకు టికెట్ దక్కకపోతే పార్టీ మారేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు పార్వతీపురంలో వార్తలు షికారు చేస్తున్నాయి. అదికాక టీడీపీలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో జోగారావుకు ఇది కలిసొచ్చే అంశమని జిల్లా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+