• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Target Raghurama:పవన్ - చంద్రబాబుకు వైసీపీ ట్రాప్: ఢిల్లీలో జగన్ కొత్త గేమ్

By Lekhaka
|

వైసీపీకి ఏమైంది. ఇప్పటి దాక కేంద్రం అడగకపోయినా అన్నింటా మద్దతిస్తూ వచ్చిన వైసీపీ వైఖరిలో సడన ఛేంజ్. పార్లమెంట్ వేదికగా కేంద్రంపై విమర్శల దాడి. ప్రధాని ముందే పోడియంలోకి వెళ్లి నినాదాలు. ఇప్పుడు జాతీయ స్థాయిలో..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కేంద్రంలో ఎవరి మద్దతు లేకుండా బీజేపీ సొంతంగా పగ్గాలు చేపట్టటంతో... ఇక ప్రత్యేక హోదా సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అయింది. ముఖ్యమంత్రి గా జగన్ పగ్గాలు చేపట్టిన తరువాత తొలి ఢిల్లీ టూర్ లోనూ ఇదే అంశం పరోక్షంగా స్పష్టం చేసారు.

 వైసీపీ సడన్ గేమ్ ఛేంజ్..

వైసీపీ సడన్ గేమ్ ఛేంజ్..

రెండేళ్లుగా వైసీపీ లోక్ సభలో...ఇతర సమావేశాల్లో అప్పుడప్పుడు ప్రస్తావించటం మినహా ఆందోళనలకు దిగలేదు. అడుగుతూనే ఉంటాం..అంటూ వైసీపీ గతంలోనే తేల్చి చెప్పింది. కానీ, తాజా పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ సడన్ గా గేమ్ మార్చింది. కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించింది. ప్రత్యేక హోదా పైన రాజ్యసభలో...పోలవరం పైన లోక్ సభలోనూ నినాదాలు చేసింది. సభ్యులు పోడియంలోకి వెళ్లారు. వైసీపీ తమ గేమ్ మార్చటం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది.

 టీడీపీ-జనసేన అంచనాలకు అందకుండా..

టీడీపీ-జనసేన అంచనాలకు అందకుండా..

వైసీపీ సడన్ ఎటాక్ ను టీడీపీ అంచనా వేయలేదు. వైసీపీ ఎంపీలు దీని ద్వారా ఒక విధంగా టీడీపీ..అదే విధంగా బీజేపీ మిత్రపక్షం జనసేనను ఆత్మరక్షణలో పడేసింది. ప్రత్యేక హోదా అంశంతోనే 2019 ఎన్నికల ముందు టీడీపీనీ పక్కా ట్రాప్ చేసిన జగన్..నాడు బీజేపీకి చంద్రబాబును దూరం చేసారు. తిరిగి బీజేపీతో మిత్రుత్వం కోరుకుంటున్న టీడీపీ...మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రత్యేక హోదా పైన ప్రశ్నించటం... జగన్ ను ఎక్కడా బలంగా నిలదీయలేక పోతున్నాయి. కేవలం ఆ రెండు పార్టీలు బీజేపీతో ప్రత్యక్షంగా..పరోక్షంగా రిలేషన్ కోరుకోవటమే.

 మరలా ఏపీలో హోదా ఛాంపియన్ కోసమే..

మరలా ఏపీలో హోదా ఛాంపియన్ కోసమే..

ఇక, ఇప్పుడు వైసీపీ కేంద్రం పైన ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవటం ద్వారా ఖచ్చితంగా టీడీపీ-జనసేన సైతం తమకు తాము పాటిస్తున్న స్వీయ నియంత్రణ దాటి..ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించాల్సిందే. అదే సమయంలో బీజేపీని ఇరుకున పెట్టే విధంగా వైసీపీని డిమాండ్లు చేసే పరిస్థితి ఇప్పటికైతే కనిపించటం లేదు. తిరిగి ప్రత్యేక హోదా అంశంలో పై చేయి సాధించటం వైసీపీ తొలి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక, కేంద్రానికి తాము అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నా..తమకు కేంద్రం నుండి ఆశించిన సహకారం అందటం లేదనే భావన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.

 రఘురామ పైన చర్యలు తీసుకోరా..

రఘురామ పైన చర్యలు తీసుకోరా..

చివరకు రఘురామ రాజు అంశంలో సైతం బీజేపీ ఒక విధంగా రెబల్ ఎంపీకే మద్దతు ఇస్తున్నట్లుగా వ్యవహరిస్తూ.. తాము ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సీరియస్ గా తీసుకోకపోవటం మరింత ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన ధరల విషయంలోనూ కేంద్రం తేల్చటం లేదు. దీంతో..పాటుగా జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా ప్రశాంత్ కిషోర్ కీలకంగా మారుతున్నారు. ఆయన ఏమైనా కొత్త వ్యూహం వైసీపీకి సూచించారా అనే చర్చ సైతం సాగుతోంది.

  CM Jagan VS Raghurama Krishnam Raju | Oneindia Telugu
   వ్యూహమా..సహకారమా

  వ్యూహమా..సహకారమా

  ఏపీలో మిగిలిన ప్రధాన పార్టీలు బలం పంజుకోకుండా వైసీపీనే ఇటువంటి స్ట్రాటజీ అమలు చేస్తుందా అనే చర్చ నడుస్తోంది. అయితే, మరి కొందరు మాత్రం జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాల క్రమంలో పార్లమెంట్ లో వైసీపీ కేంద్రానికి పరోక్షంగా అందిస్తున్న సహకారంలో ఇదో భాగమనే వాదన ఉంది. కొన్ని అంశాలపైన చర్చ సాగితే కేంద్రం ఇరుకున పడే అవకాశం ఉందని..దీంతో..పరోక్షంగా బీజేపీకి సహకారంలో భాగంగా సభలో ఆందోళన చేస్తున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ, వైసీపీ నేతలు మాత్రం తమకు ఏపీలో రాజకీయంగా బలం సాధించటమే ముఖ్యమని స్పష్టంగా చెబుతున్నారు.

  English summary
  YSRCP All of suddenly changed political game plan in parliaments sessions. YCP mp's demanding special stauts for AP and stall the house. seem to be big strategy behind YSRCP move
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X