వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ ఒక్కటే ఉంది: ధర్మాన, కాంగ్రెస్‌పై ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dharmana Prasad Rao
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే విషయం నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. ఆయన గురువారం మాట్లాడుతూ... తనను కాంగ్రెసు పార్టీ ముద్దాయిని చేసిందని, తాను మొదటి నుండి తెలుగుదేశం పార్టీ పైన పోరాడుతున్నందున ప్రత్యామ్నాయంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమే కనిపిస్తోందని చెప్పారు. తనకు కాంగ్రెసు పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదన్నారు.

కాగా, ధర్మాన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ నెలలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెసు పార్టీలో ఎన్నాళ్లుంటానో చెప్పేలనని, రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇక కొనసాగలేనని, అసెంబ్లీలో సమైక్యవాణి వినిపించిన తర్వాత పార్టీ నుంచి వైదొలుగుతానని ధర్మాన చెప్పారట.

కాంగ్రెసు పార్టీని వీడాలనుకుంటున్నట్లుగా వారికి చెప్పారట. అందరూ సహకరించాలని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు ఉంటానో కూడా చెప్పలేనని వారితో అన్నారట. సమైక్యాంధ్ర కోసం తన నిర్ణయాన్ని సమర్థించాలని ధర్మాన కోరగా, మెజార్టీ సర్పంచులు ఆమోదం కూడా తెలిపారట.

ధర్మాన నవంబర్ నెలలోనే పార్టీలో చేరుతారని అందరూ భావించారు. అయితే విభజన తదితర కారణాల వల్ల డిసెంబర్ నెలలో చేరాలని వాయిదా వేసుకున్నారట. తాజాగా తనను కాంగ్రెసు ముద్దాయిని చేసిందని, టిడిపి పైన మొదటి నుండి పోరాడుతున్నానని, తనకు జగన్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయమని చెప్పడం గమనార్హం.

English summary
Former Minister and Congress senior MLA Dharmana Prasad Rao may join YSR Congress Party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X