నా తమ్ముడు జూ ఎన్టీఆర్ కు.. కొడాలి నాని ఎమోషనల్, ఆ ఫొటోతో..!!

ప్రముఖ హీరో తారక్ జన్మదినం నేడు. సినీ.. రాజకీయ ప్రముఖులు జూ ఎన్టీఆర్ కు జన్మదిన శుభా కాంక్షలు చెబుతున్నారు. వైసీపీ ముఖ్యనేత.. మాజీ మంత్రి కొడాలి నాని చేసిన సోషల్ మీడియా పోస్టింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జూ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు చెబుతూ రాసిన పోస్టింగ్ సినీ.. రాజకీయ రంగాల్లో సంచలనంగా మారింది. తారక్ సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో తీసిన రేర్ ఫొటోను ఈ పోస్టింగ్ కు జత చేసారు.

జూ ఎన్టీఆర్ జన్మదినం వేళ మాజీ మంత్రి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అందులో నా తమ్ముడు..జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్టింగ్ లోనే తమ మధ్య ఉన్న అనుంబంధాన్ని స్పష్టం చేసారు. కొడాలి నాని ఈ పోస్టింగ్ లో షేర్ చేసిన ఫొటో వెనుక పెద్ద కధే ఉంది. జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఎంత స్నేహంగా ఉండేవాళ్లో ఈ ఒక్క ఫొటో చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కొడాలి నాని కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉంటే.. కొడాలి నాని ఒడిలో కాలు పెట్టి జూనియర్ ఎన్టీఆర్ మరో కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆ ఫొటోను చూస్తుంటే సినిమా షూటింగ్ గ్యాప్‌లో తీసిన ఫొటోలా ఉంది. ఈ అరుదైన ఫొటోలోని మరో వ్యక్తి వల్లభనేని వంశీ. ఆ సాన్నిహిత్యంతోనే జూనియర్ ఎన్టీఆర్‌తో వినాయక్ తీసిన 'అదుర్స్' సినిమాకు వల్లభనేని వంశీ నిర్మాతగా కూడా వ్యవహరించారు.

కూటమి రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు - బీజేపీ, జనసేన నుంచి అనూహ్యంగా..!!
కూటమి రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు - బీజేపీ, జనసేన నుంచి అనూహ్యంగా..!!
ysrcp-key-leader-kodali-nani-special-greeting-for-hero-jr-ntr-on-his-birth-day-with-rare-photo-goes

నాటి పొటోతో మరోసారి కొడాలి నాని

అయితే, 2009 ఎన్నికల ప్రచారంలో గాయపడిన తారక్ ఆ తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. కొడాలి నాని, వల్లభనేని వైసీపీలో చేరారు. 2019-24 మధ్య కాలంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల విషయంలో జూ ఎన్టీఆర్ వైఖరి గురించి టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సైతం చర్చగా మారాయి. అయితే.. తొలి నుంచి జూ ఎన్టీఆర్ కుటుంబంతో కొడాలి నానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జూ ఎన్టీఆర్ తండ్రి హరిక్రిష్ణతో సన్నిహితంగా ఉండేవారు. కాగా.. రాజకీయంగా ఇప్పుడు దారులు మారిపోయాయి. అయినా.. తారక్ పైన తన అభిమానం నాని చాటుకుంటున్నారు. ఇక.. ఇప్పుడు తారక్ జన్మదినం వేళ వల్లభనేని వంశీ, కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటో వైరల్ కావడం మాత్రం ఆసక్తికర చర్చకు అవకాశం ఇచ్చింది. అప్పటి వీరి స్నేహ బంధాన్ని గుర్తు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+