• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓటరుపై కొడాలి నాని దౌర్జన్యం?, కారణమిదేనా?: చంద్రబాబు సంచలనంపై వైసీపీ

|
  Lok Sabha Elections 2019 : ఓటరుపై కొడాలి నాని దౌర్జన్యం..? || Oneindia Telugu

  గుడివాడ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 91 లోకసభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం లోకసభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏపీలో లోకసభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో నాలుగు నెలల క్రితమే ముందస్తు అసెంబ్లీ పోల్స్ నిర్వహించారు. తెలంగాణలో లోకసభకు, ఏపీలో లోకసభ, అసెంబ్లీకి పోలింగ్ జరుగుతోంది.

  ఏపీలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈవీఎంల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేయగా, వైసీపీ నేతలు వాటిని కొట్టి పారేశారు. ఏ పార్టీకి ఓటేసినా ఫ్యాన్ గుర్తుకే వెళ్తుందని చంద్రబాబు ఆరోపించగా, ఈవీఎంలపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

  ఓటరుపై చేయి చేసుకున్న కొడాలి నాని

  ఓటరుపై చేయి చేసుకున్న కొడాలి నాని

  గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఓ ఓటరుపై చేయి చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో డబ్బుల పంపిణీ విషయంలో వైసీపీ కార్యకర్తలు, ఓటర్ల మధ్య విభేదాలు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా కొడాలి నాని ఓటరుపై దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. ఇది స్థానికంగా కలకలం రేపిందని తెలుస్తోంది. వైసీపీ వారు డబ్బులు పంచుతున్నారని పలువురు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

  చంద్రబాబు సంచలన ఆరోపణపై వైసీపీ ఆగ్రహం

  చంద్రబాబు సంచలన ఆరోపణపై వైసీపీ ఆగ్రహం

  మరోవైపు, తెలుగుదేశం పార్టీ నేతలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏ ఓటు వేసినా వైసీపీకి వెళ్తోందని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఓటు వేసి వచ్చి ఈవీఎంలపై ఇలా అసత్య ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే వారు ఈవిఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి అసత్య ఆరోపణలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

  టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ ఆరోపణ

  టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ ఆరోపణ

  టీడీపీ నేతలు ఓటమి భయంతో వైసీపీ నేతలపై దాడులకు కూడా తెగబడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఏలూరు టీడీపీ అభ్యర్థి తమ పార్టీ నాయకుడిపై దాడి చేశారని మండిపడ్డారు. పొద్దుటూరులో సీఎం రమేష్ కూడా తమ పోలింగ్ ఏజెంట్లపై దాడులకు తెగబడ్డారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, టీడీపీ నేతలు పచ్చ చొక్కాలు వేసుకొని వచ్చి ఓటు వేశారని విమర్శించారు. అనంతపురం గుత్తిలో జనసేన అభ్యర్థి ఈవీఎం పగులగొడితే ఎల్లో మీడియా మాత్రం వైసీపీ నాయకులు అంటూ ఆరోపణలుచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that YSR Congress Party leader and MLA candidate Kodali Nani slapped voter in Krishna district's Gudiwada on Thursday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more