Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ గర్జనతో వ్యూహం మార్చిన వైసీపీ ? టీఆర్ఎస్ ను మరిపిస్తూ ! విపక్షాల ఎలిమినేషన్ ప్లాన్ ?

ఏపీలో నెలకొన్నఅమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరుతో రాజకీయ పార్టీల వ్యూహాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అమరావతిని సమర్ధిస్తున్న విపక్ష పార్టీలన్నింటినీ ఉనికే లేకుండా చేసేందుకు మూడు రాజధానులకు మద్దతిస్తున్న వైసీపీ భారీ వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. ఇవాళ విశాఖలో నిర్వహించిన గర్జన ద్వారా వైసీపీ అమల్లో పెట్టిన ఈ ప్లాన్ గతంలో తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అమలు చేసిన తరహాలో ఉంది.

విశాఖలో గర్జించిన వైసీపీ

విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ సాయంతో వైసీపీ నిర్వహించిన మూడు రాజధానుల గర్జన విజయవంతమైంది. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఇప్పటివరకూ అధికారికంగా అసెంబ్లీ, మండలి వంటి వేదికలతో చేసిన రాజకీయానికి మరింత పదును పెడుతూ ఇప్పుడు జనంలోకి వెళ్లింది. రాజధాని కావాలా వద్దా అంటూ నేరుగా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు వైసీపీ వేస్తున్న ప్రశ్నకు వారి నుంచి సానుకూల స్పందనే వస్తోంది. అదే సమయంలో విపక్షాలకు ఇదంతా కంటగింపుగా మారుతోంది. దీంతో ఇదే అదనుగా మరో కొత్త రాజకీయానికి వైసీపీ తెరదీస్తోంది.

బాయ్ కాట్

బాయ్ కాట్

ఇవాళ నిర్వహించిన విశాఖ గర్జనలో వైసీపీ మంత్రులు, నేతలు అంతా ఒకే తాటిపైకి వచ్చి హెచ్చరికలు మొదలుపెట్టారు. విశాఖ రాజధానిని వ్యతిరేకించే వారిని ఉత్తరాంధ్రలో అడుగుపెట్టనివ్వద్దని ఒకరంటే, దాడులు చేయాలని మరొకరు, వారికి మద్దతుగా ఉన్న మీడియా ఛానళ్లను, పత్రికలను బ్యాన్ చేయాలని మరొకరు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని ఇంకో అడుగు ముందుకేసి కేబుల్ టీవీ ఛానళ్ల ఆపరేటర్లు ఆయా ఛానళ్లను ప్రసారం చేయకుండా అడ్డుకోవాలని కూడా సూచించారు. దీంతో ఈ బాయ్ కాట్ పిలుపులు విశాఖ గర్జనలో అందరి దృష్టినీ ఆకర్షించాయి.

 టీఆర్ఎస్ ను మరిపిస్తూ హెచ్చరికలు ?

టీఆర్ఎస్ ను మరిపిస్తూ హెచ్చరికలు ?

గతంలో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజుల్లో అప్పటి విపక్ష పార్టీ టీఆర్ఎస్ అధికార పార్టీ కాంగ్రెస్ పై ఇలాంటి హెచ్చరికలే చేసేది. అంతేకాదు ఆంధ్రా పార్టీలంటూ టీడీపీ, సీపీఎం వంటి పార్టీల్నీ ఇలాగే టార్గెట్ చేసేది. రోడ్లపై నాయకుల్ని నిలదీయాలని, రాజీనామాలు చేసే వరకూ పట్టుబట్టాలని, దాడులు చేయాలని ప్రోత్సహించేది. అంతే కాదు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారిపై దాడులకు పిలుపునివ్వడం, మిలియన్ మార్చ్ లు నిర్వహించడం చేసేది. చివరికి అవే ఉద్యమాన్ని హింసాత్మకంగా కూడా మార్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ కూడా టీఆర్ఎస్ బాటలో అలాంటి పిలుపుల్నే ఇస్తుండటం చూస్తుంటే రాబోయే రోజుల్లో మూడు రాజధానుల ఉద్యమం ఎలా ఉండబోతోందన్నది స్పష్టమవుతోంది.

 విపక్షాల ఎలిమినేషన్ ప్లాన్ ?

విపక్షాల ఎలిమినేషన్ ప్లాన్ ?

ఇప్పటివరకూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకతతో మొదలైన విపక్షాల పోరు.. సీఎం జగన్,వైసీపీ నేతలపై వ్యక్తిగతదాడుల వరకూ వెళ్తోంది. సోషల్ మీడియాలో పరిస్దితి ఇంకా దారుణం. దీంతో సీఎం జగన్ స్వయంగా తానే రంగంలోకి దిగి విపక్షాలు, మీడియాపై బహిరంగసభల్లో బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. విపక్షాలు, మీడియా జట్టు కట్టి తన ప్రభుత్వాన్ని అస్దిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా విపక్షాలను ప్రజల చేతే బాయ్ కాట్ చేయించేలా ఒత్తిడి పెంచేందుకు విశాఖ గర్జనలో ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. తద్వారా రాబోయే ఎన్నికల నాటికి ఒకప్పుడు కేసీఆర్ తరహాలో విపక్షాలను ఎలిమినేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+