ఆ మాటకొస్తే జనసేన నిర్వాహణను చూసేది ఆయనే..!!

Pawan Kalyan: జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి- భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయంపై చర్చకు దారి తీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశమౌతోంది.

ఈ సభపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. దాదాపుగా రెండు గంటల పాటు పవన్ కల్యాణ్ ఇచ్చిన ప్రసంగం, చేసిన విమర్శలు, ఆరోపణలపై ఎదురుదాడికి దిగారు. సెటైర్లు సైతం సంధించారు. జనసేనను తెలుగుదేశం పార్టీకి బీ-టీమ్‌గా అభివర్ణించారు.

Janasena

పిఠాపురం జయకేతనం సభలో రెండు గంటల పాటు మాట్లాడారని, ఏం మాట్లాడారో ఆయనకైనా అర్థం అయివుంటుందని తాను అనుకోట్లేదని అంబటి రాంబాబు అన్నారు. 21 సీట్లు గెలుచుకుని 100 శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించామంటూ పవన్ కల్యాణ్ సంబర పడుతున్నారని, నిజానికి- టీడీపీలో టికెట్‌ దక్కని వారికే జనసేన టికెట్లిచ్చిన విషయాన్ని మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు.

గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు చంద్రబాబు మనుషులేనని విమర్శించారు. అసలు జనసేన నిర్వాహణను చూసేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తేల్చి చెప్పారు అంబటి రాంబాబు. సూపర్‌ 6, సూపర్‌ 7.. పథకాలు ఏమయ్యాయో చెప్పకుండా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించినట్లు గొప్పలు చెప్పుకొంటే సరిపోదని అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చి ఆరోగ్యం చెడగొట్టుకున్నాడని పవన్ కల్యాణ్ చెప్పుకోవడంలో అర్థం లేదని అంబటి అన్నారు. ఆయన ఆరోగ్యానికి ఏమైందో.. ఎందుకు పాడైందో వెల్లడించాలని అన్నారు. గతంలో హిందీని వ్యతిరేకించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎందుకు మద్దతు ఇస్తోన్నాడని, ఉత్తరాది అహంకారం అంటూ హూంకరించిన ఆయన ఇప్పుడు వాళ్లకు ఎందుకు సహకారిగా మారాడని ప్రశ్నించారు.

Take a Poll

పవన్ సిద్ధాంత ఎక్కడ మొదలైంది.. ఎక్కడికి వెళ్తోందనేది కనీసం ఆయనకైనా బోధపడుతోందా? అని అంబటి అన్నారు. నాలుగు బాషల్లో మాట్లాడిన పవన్ తనను తాను దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధిగా చెప్పుకొనే ప్రయత్నం చేస్తోన్నారని, ఆయనకు అంత సీన్ ఉందా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+