అనిల్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం, ఇక దూరం- అసలు ఏం జరిగింది..!!

ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల వేళ కూటమి - వైసీపీలో రాజకీయం మారుతోంది. ఏకపక్షంగా గెలుపు ఉండాలని కూటమి నేతలు లక్ష్యంగా నిర్ణయించారు. ఇటు వైసీపీ సైతం సై అంటోంది. ఇదే సమయంలో 2029 టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఈ సమయంలోనే మాజీ మంత్రి.. వైసీపీ కీలక నేత అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో, నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది.

వైసీపీ ముఖ్య నేత.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక ఎన్నిక ల కోసం పార్టీ అధినేత జగన్ నియోజకవర్గాల ఇంఛార్జ్ లకు హెచ్చరిక చేసారు. కూటమి ఎక్కడైనా ఏకగ్రీవం చేసుకుంటే ఈ నియోజకవర్గ ఇంఛార్జ్ కు వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదని తేల్చేసారు. ఈ సమయంలో పార్టీలో చర్చ జరుగుతున్న వేళ అనిల్ కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేసారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో తనకో పేజీ ఉందని.. తనకో చరిత్ర ఉందని చెప్పుకొచ్చారు. 2014,2019 ఎన్నికల్లో తనకు జగన్ సీటు ఇచ్చారని.. మంత్రిగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. తాను ఎవరో తెలియని పరిస్థితుల్లో తనను గుర్తించే స్థాయికి ఎదిగేలా చేసిన వ్యక్తి జగన్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీటు వచ్చినా.. రాక పోయినా రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన సంతృప్తి తనకు చాలంటూ అనిల్ వ్యాఖ్యానించారు.

 మోదీ కేబినెట్ ప్రక్షాళన, ఇన్- ఔట్ ఇలా: తెలుగు రాష్ట్రాల నుంచి.. లిస్టులో...!!
మోదీ కేబినెట్ ప్రక్షాళన, ఇన్- ఔట్ ఇలా: తెలుగు రాష్ట్రాల నుంచి.. లిస్టులో...!!
ysrcp-leader-anil-kumar-yadav-sensational-comments-over-his-political-future-becomes-viral-here-the

నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది

కాగా, 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో అనిల్ కు కీలకమైన ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు కేటాయించారు. విస్తరణలో అనిల్ స్థానంలో నెల్లూరు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రిగా అవకాశం దక్కింది. ఇక.. 2024 ఎన్నికల్లో అనిల్ ను నెల్లూరు కాదని.. నర్సరావు పేట ఎంపీగా బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో అనిల్ ఓడిపోయారు. అనిల్ సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీ నుంచి మైనార్టీ అభ్యర్ధి ఖలీల్ అహ్మద్ కు జగన్ సీటు కేటాయించారు. ప్రస్తుత మంత్రి నారాయణ చేతిలో ఖలీల్ 72,489 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక.. ప్రస్తుతం నెల్లూరు సిటీ వైసీపీ ఇంఛార్జ్‌గా ఎమ్మెల్సీ పార్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సీటు ఆశిస్తున్నారు. దీంతో.. అనిల్ కు సీటు దక్కటం కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ సమీకరణాల వేళ అనిల్ ముందస్తుగానే వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. అయితే, అనిల్ కు జగన్ ఎలాంటి అవకాశం కల్పిస్తారు.. భవిష్యత్ నిర్ణయాలు ఏంటనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+