సింగపూర్ ఒప్పందం వెనుక, మోడీకి చెప్పాం: బొత్స, రోజా నియోజకవర్గానికి క్యూ

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: రాజధాని అమరావతి నిర్మాణం నిమిత్తం సింగపూర్ కేంద్రంగా నడుస్తున్న సంస్థలతో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న డీల్స్ వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ ఆదివారం నాడు ఆరోపించారు.

మోడీకి బాబు రూ.1000 నోట్లపై సూచన, అక్కడా జగన్ టార్గెట్!
ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పాలనలో లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన అవినీతి గురించిన పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినట్లు చెప్పారు.

సింగపూర్ ఒప్పందాల పైన సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారఅణ జరిపించాలన్నారు. స్విస్ చాలెంజ్ పద్ధతిని సుప్రీం కోర్టు కూడా తప్పుబట్టిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.

 YSRCP leader Botsa takes on Chandrababu

నగరికి వైసిపి నేతల క్యూ

వైసిపి నేతలు చిత్తూరు జిల్లా నగరికి క్యూ కట్టారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని రోజా సొంత నియోజకవర్గమైన నగరిలో నిర్వహించాలని భావించిన నేపథ్యంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు.

ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, చింతల, నారాయణ స్వామి, సునీల్, దేశాయి తిప్పారెడ్డి తదితరులు అప్పటికే నగరిలో మకాం వేశారు. ఏర్పాట్లను పార్టీ ఎమ్మెల్యే రోజా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. గడప గడపకూ వైసీపీ' సాగుతున్న తీరు, చంద్రబాబు ప్రభుత్వ అభివృద్ధి వ్యతిరేక విధానాలపై వీరు చర్చిస్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP leader Botsa Satyanarayana takes on AP CM Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి