ఏపీ ఖజానాలోకి ప్రైవేటు వ్యక్తుల ఎంట్రీ ? బుగ్గన సంచనలు ఆరోపణలు..!

ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను చంద్రబాబు ప్రభుత్వం సంపూర్ణంగా తాకట్టుపెడుతోందని మాజీ ఆర్ధిక మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. ఏపీ చరిత్రలో అప్పులు కోసం రాష్ట్ర ఖజానాల్లోకి అధికారికంగా వెళ్లే అవకాశం ఇస్తున్నారని విమర్శించారు. సమయానికి కిస్తీలు రాకపోతే ఆ ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఖజానాలోకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చని ఆయన తెలిపారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాలు తాక్టటు పెడితే చాలా అన్యాయం అంటూ గగ్గోలు పెట్టారని, ఇవాళ ఏపీఎండీసీకి చెందిన గనులను మొత్తం తాకట్టు పెట్టారని బుగ్గన గుర్తుచేశారు.

దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యాంగ విరుద్దమైన విధానాలకు తెగబడిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థ గా ఉన్న ఏపీఎండీసీ నుంచి రూ.9వేల కోట్ల అప్పులను బాండ్ల రూపంలో సేకరిస్తున్న విధానంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆర్బీఐ నుంచే రాష్ట్రానికి వచ్చే నిధులు నేరుగా ఆ బాండ్ల కొనుగోలుదార్లకు మళ్ళించేందుకు అనుమతి ఇవ్వడం అత్యంత దారుణమన్నారు.

ysrcp leader buggana rajendranath slams Chandrababu regime for allowing private into exchequer

రాజ్యాంగ విరుద్ధమైన ఈ విధానానికి అనుమతించిన అధికారులు కూడా భవిష్యత్తులో దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని బుగ్గన రాజేంద్రనాథ్‌ తేల్చి చెప్పారు.కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆఫ్‌ బడ్జెడ్‌ బారోయింగ్‌ను ప్రారంభించిందని, సంపద సృష్టి జరగడం లేదని బుగ్గన ఆరోపించారు. అప్పులు విపరీతంగా చేశారని, ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా అప్పులు చేయాలని ఒక స్కీం ప్రారంభించారని తెలిపారు. ఏపీఎండీసీ ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపైన ఈ అప్పులు చేయాలనేదే ఈ స్కీం అన్నారు.

బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ బాండ్స్‌ మీద అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏపీఎండీసీకి ప్రభుత్వ రంగ సంస్థగా ఎక్కడైనా ఖనిజాలు ఉంటే, వాటిని వెలికితీసి, విక్రయించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం ఈ సంస్థ ముఖ్య కార్యకలాపాలు అన్నారు. దీనిలో ఎక్కువగా అవుట్‌ సోర్సింగ్‌ ద్వారానే ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుందన్నారు. ఏపీఎండీసీ వ్యాపారం అంతా థర్డ్‌పార్టీకి టెండర్లు పిలిచి అవుట్‌ సోర్సింగ్‌ ద్వారానే చేపడుతుందని, కాబట్టి ఏపీఎండీసీకి మూలధన వ్యయం పెద్ద ఎత్తున అవసరం లేదని, కానీ రూ.9 వేల కోట్లు కావాలని ఇప్పుడు బాండ్లు జారీ చేస్తున్నారని ఆరోపించారు.

ysrcp leader buggana rajendranath slams Chandrababu regime for allowing private into exchequer

ఇంత పెద్ద ఎత్తున నిధులను సేకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్‌ అవసరం అవుతుందని బుగ్గన తెలిపారు. ఇందుకోసం ముంబైకి చెందిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థకు సంప్రదించారన్నారు. ఈ సంస్థ ఆయా సంస్థలను పరిశీలించి రేటింగ్‌ను ఖరారు చేసి ప్రకటిస్తుందన్నారు. ఈ సంస్థ ఏపీఎండీసీకి ఇచ్చిన రేటింగ్‌ చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.

ఏపీ చరిత్రలో ఎప్పు జరగని విధంగా ఆర్బీఐకి డైరెక్ట్‌ డెబిట్‌ మెకానిజం ద్వారా డబ్బులు డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తారని, దీని ప్రకారం ఏపీఎండీసీకి సంబంధించిన సంపూర్ణ ఆదాయాలను తాజాగా జారీ చేస్తున్న బాండ్‌ లకు చెల్లించే అసలు, వడ్డీలకు వాడబోతున్నారన్నారు. దీనిలో సంస్థకు సంబంధించిన పూర్తి మైనింగ్‌ ఆదాయాలు అప్పు ఇచ్చే సంస్థకు దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ కలెక్షన్‌ ఒక ఖాతాలో పెట్టి, దాని మీద నియంత్రణ సదరు బాండ్స్‌ సంస్థకు ఉంటుందన్నారు.

అప్పులు తిరిగి చెల్లించేందుకు బాండ్‌ సర్వీసింగ్‌ పేరుతో ప్రత్యేకమైన రెండో ఖాతా (డెబిట్‌ సర్వీస్‌ రిజర్వ్‌ ఎక్కౌంట్‌-డీఎస్‌ఆర్‌ఏ) తెరుస్తున్నారని, ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ముందుగానే ఉంచాలని బుగ్గన తెలిపారు. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, ప్రభుత్వాన్ని అడగకుండానే, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఇచ్చే నిధులను ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు అధికారం ఇవ్వబోతున్నారని బుగ్గన తెలిపారు.

ఇటువంటి నిబంధనలు, వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ ఇలా ఇవ్వలేదని బుగ్గన గుర్తుచేశారు. ఒకవేళ ఏ కారణం వల్ల అయినా ఈ నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసిన వారికి వెళ్ళిపోతాయన్నారు. ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారికి చేసే చెల్లింపులకు గానూ ముందుగానే నిర్ధేశించిన ఖాతాల్లో మొదటి నెలలోనే ముప్పై శాతం అంటే, మూడో భాగం సదరు ఖాతాలో ఖచ్చితంగా ఉంచాలన్నారు. ఇలా ప్రతి నెలా కూడా ముప్పై శాతం నిధులను ఆ ఖాతాలో ఉంచుతూ పోవాలన్నారు.

ఇది కాకుండా డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ఆరు నెలలకు చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిల్వగా చూపుతూ రావాలని బుగ్గన తెలిపారు. ఏ కారణాల వల్ల అయినా ఈ నిధులు తగ్గిపోతే నేరుగా ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసిన వారికి వెళ్ళిపోతాయన్నారు. ఇండియా రేటింగ్స్‌ సంస్థ ప్రభుత్వ ఆదాయం గత ఏడాది అంతంత మాత్రంగానే ఉందని పేర్కొందని బుగ్గన తెలిపారు. 1.3 శాతం మాత్రమే వృద్ధి కనిపిస్తోందని, ద్రవ్యలోటు స్థూల ఉత్పత్తిలో 4.2 శాతం ఉండాల్సి ఉంటే 4.6 శాతంకు పెరిగింది కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పిందని తెలిపారు.

అయినా కూడా రేటింగ్‌ ఎందుకు ఇచ్చారంటే, డిబెంచర్‌ కొనుగోలుదార్లకు డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిల్వ లేకపోతే నేరుగా ఆర్బీఐ నుంచి నిధులు ఆ ఖాతాకు జమ అయ్యేందుకు అంగీకరించడం వల్లే దీనికి 'సీఈ' రేటింగ్‌ ఇచ్చారన్నారు. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని తేల్చేశారు. ఏపీ ఎండీసీ గత ఏడాది వార్షిక నివేదికలో తొమ్మిది నెలలకు గానూ సంస్థ రెవెన్యూ రూ.910 కోట్లుగా ఉందని, అంటే 12 నెలలకు చూస్తే సుమారు రూ.1200 కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు. కానీ వీరు చేస్తున్న అప్పులు, డిఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ముందుస్తుగా పెట్టే ఆరు నెలల నిల్వలతో కలిపి చూస్తే ఏకంగా రూ.10 వేల కోట్లు అన్నారు. అంటే వీరి ఆదాయంతో పోలిస్తే చేస్తున్న అప్పులు ఎనిమిది రెట్లు ఎక్కువని తెలిపారు. ఇది ఏ బ్యాంక్‌ అంగీకరించదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+