టిడిపిలోకి బుట్టా రేణుక చేరికపై షాకింగ్: 'అప్పటి నుంచే జగన్ కుట్ర'
వైసిపి నాయకురాలు, కర్నూలు లోకసభ సభ్యురాలు బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరడంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.తాజాగా ఓ నాయకుడు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసిపి అధినేత జగన్‌కు చెందిన సాక
Recommended Video

కర్నూలు: వైసిపి నాయకురాలు, కర్నూలు లోకసభ సభ్యురాలు బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరడంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఓ నాయకుడు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసిపి అధినేత జగన్‌కు చెందిన సాక్షి మీడియా బుట్టా రేణుకపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనే వాదనలు వినిపించాయి.

వైసిపి నేత సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కొత్తకోట ప్రకాశ్ రెడ్డి అధిష్టానం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి కోసం బుట్టా రేణుక, తాను చాలా కష్టపడ్డామని చెప్పారు.

డబ్బులు అడుగుతున్నారు, దారుణం
టిక్కెట్టు కోసం వైసిపి ముఖ్య నేతలు డబ్బులు అడుగుతున్నారని, ఇది చాలా దారుణం అని ఆయన అభిప్రాయపడ్డారు. బుట్టా రేణుక, తమ పైన కుట్ర జరుగుతోందని ఆయన వాపోయారు.

జగన్ లెక్క చేయట్లేదు, టిడిపిలో చేరుతున్నాం
కర్నూలు జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్‌తో బుట్టా రేణుక, తాను భేటీ అయ్యామని, అప్పటి నుంచి తమ పైన అధిష్టానం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో జగన్ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. అందుకే మంగళవారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నట్లు చెప్పారు.

మంగళవారం టిడిపిలోకి
కాగా, వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు బుట్టా రేణుక ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తన ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదని జగన్‌కు చెప్పారు. దీంతో శాసన సభ నియోజకవర్గాన్ని జగన్ సూచించారు. అదే సమయంలో చంద్రబాబు నుంచి ఆమెకు కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే విషయమై క్లారిటీ రావడంతో మంగళవారం టిడిపిలో చేరుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications