Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐవీఆర్ఎస్ కాల్స్ తో టార్చర్...! డీజీపీ వద్దకు జోగి రమేష్..!

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో తాజాగా బయటపడిన కల్తీ మద్యం దందాపై ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే.. మరోవైపు రాజకీయ ప్రకంపనలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే కల్తీ మద్యం కేసులో ఇద్దరు టీడీపీ నేతల్ని చంద్రబాబు పార్టీీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వైసీపీ దీన్ని రాజకీయ అస్త్రంగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో వైసీపీ నేత జోగి రమేష్ తో కల్తీ మద్యం కేసు నిందితులకు ఉన్న బంధాన్ని నిరూపించేందుకు టీడీపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా జోగి రమేష్ కూ కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జనార్ధన్ రావుకూ మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తూ ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు కాల్స్ చేయిస్తోంది. ఇందులో ప్రధానంగా జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇవాళ జోగి రమేష్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఓవైపు కల్తీ మద్యం కేసు దర్యాప్తు జరుగుతుంటే.. మరోవైపు ఇలా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ysrcp leader jogi Ramesh complains in dpg office on tdp s ivrs calls over spurious liquor

ఇదే అంశంపై జోగి రమేష్ ఇవాళ ఇతర వైసీపీ నేతలతో కలిసి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఉన్న ఏడీజీకి ఫిర్యాదు చేశారు. నకిలీ మద్యం దందాలో అడ్డంగా దొరికిపోయి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కూటమి పెద్దలు కుట్రపూరితంగా ఐవీఆర్‌ఎస్ కాల్స్‌ ద్వారా తమపై విష ప్రచారం నిర్వహించారని, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. న‌కిలీ మ‌ద్యం దందాలో అడ్డంగా దొరికిపోయిన కూటమి ప్ర‌భుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. దీనికి సమాధానం చెప్పుకోలేక కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెగబడ్డారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారన్నారు.

ysrcp leader jogi Ramesh complains in dpg office on tdp s ivrs calls over spurious liquor

అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బుర‌ద జ‌ల్ల‌డ‌మే ధ్యేయంగా ఎల్లో మీడియాలో అడ్డ‌గోలుగా అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. జోగి ర‌మేశ్ ఆదేశాల‌తోనే న‌కిలీ మ‌ద్యం త‌యారు చేస్తున్నార‌ని ఆధారాలు చూపించ‌కుండా వారం రోజులుగా విష‌ప్ర‌చారం చేసి నా వ్య‌క్తిత్వ హ‌న‌నం చేస్తున్నట్లు ఆరోపించారు. వైయ‌స్సార్సీపీ మీద బుర‌ద‌జ‌ల్లడ‌మే ల‌క్ష్యంగా చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ పై విచార‌ణ జ‌రిపించి దాని వెనుక ఎవ‌రున్నారో నిగ్గుతేల్చాలన్నారు. అందుకు బాధ్యులైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని వైయ‌స్సార్సీపీ తరఫున డిమాండ్ చేశారు. అలాగే సీబీఐతో కూడా దర్యాప్తు చేయించాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+