'బడ్జెట్‌పై బాబు ఎందుకు నోరు తెరవలేదు', 'హోదాను ఆయనే వదిలేశారు'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎందుకు స్పందించలేదని వైసీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. ఏపీ ప్రజలను కేంద్రం చిన్న చూపు చూస్తోందని జోగి రమేష్ అభిప్రాయపడ్డారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబునాయుడు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని జోగి రమేష్ చంద్రబాబునాయుడును ప్రశ్నించారు.

  TDP MP's Are Jokers

  పవన్‌వి టైంపాస్ రాజకీయాలు, ఉండవల్లి రిటైర్డ్ టీచర్, జెపి విఫలనేత: కత్తి మహేష్ సంచలనం

  ఏపీకి కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగినా టిడిపి పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తోందని వైసీపీ టిడిపిపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

  'మా సహనాన్ని పరీక్షించొద్దు', 'పార్టిని బతికించుకొనేందుకే బిజెపి మాటలు

  బిజెపి, టిడిపిలు మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కేంద్రం నుండి సానుకూలమైన సంకేతాలు రాకపోవడంపై టిడిపి నేతలు కూడ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ టిడిపిపై విమర్శలు గుప్పిస్తోంది.

  వర్మకు అదే ధ్యాస, సహకరించాలి: శివప్రసాద్, బహిరంగ చర్చకు సిద్దమేనా?:బిజెపి

   బాబు ఎందుకు నోరు మెదపలేదు

  బాబు ఎందుకు నోరు మెదపలేదు

  బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎందుకు నోరు మెదపలేదని వైసీపీ నేత జోగి రమేష్ ప్రశ్నించారు.కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్రమైన అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఏం సాధించారని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ర్యాలీ నిర్వహించారని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలకు బుద్ధి, జ్ఞానం ఉందా? అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు.

   ప్రత్యేక హోదాను బాబు వదిలేశారు

  ప్రత్యేక హోదాను బాబు వదిలేశారు

  ప్రత్యేక హోదాను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వదిలేశారని మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు. ఐవైఆర్ కృష్ణారావు సాక్షి మీడియాతో మాట్లాడారు. ఏపీలో అవినీతి, దుబారా పెరగడం వల్లే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణా రావు ఆరోపించారు.అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం వల్లే టీడీపీ డ్రామాలు ఆడుతోందని కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

   రాజధానికే నిధులు పరిమితం

  రాజధానికే నిధులు పరిమితం

  ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చే డబ్బు రాజధాని ప్రాంతానికే పరిమితం చేస్తున్నారని మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు.సాక్షి మీడియాతో ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగా వెనకబడిన ప్రాంతాలని, వాటి అభివృద్ధికి ఇచ్చిన నిధులను ఆ ప్రాంతాలకే ఖర్చు చేయాలని సూచించారు. ప్యాకేజీ కింద ఇస్తామన్న నిధులపై ఓ స్పష్టత లేదన్నారు.

   దళిత తేజం పేరు మార్చుకోవాలి

  దళిత తేజం పేరు మార్చుకోవాలి

  దళిత తేజం-తెలుగుదేశం పేరును కాదు దళిత ద్రోహం-తెలుగుదేశం అని పేరు మార్చుకోవాలని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. కడప జిల్లా దళిత తేజం సమావేశంలో దళితులు కింద కూర్చుంటే టీడీపీ నేతలు కుర్చీల్లో కూర్చుంటారా, ఇంకెన్నాళ్లీ అస్పృశ్యత, అంటరానితనమని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీలో దళిత నేతలు సిగ్గుతో తలదించుకోవాలని, దళితులకు ఘోర అవమానం జరిగిందని నాగార్జున అభిప్రాయపడ్డారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ysrcp leader jogi Ramesh made allegations on Ap Cm Chandrababunaidu on Monday. why Chandrababu Naidu not responded on union budget he asked.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి