• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నందమూరి ఫ్యామిలీ ఆగ్రహంపై లక్ష్మీపార్వతి రియాక్షన్-ఎన్టీఆర్ పై చెప్పులేసినప్పుడు ?

|
Google Oneindia TeluguNews

నిన్న ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఇవాళ నందమూరి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ ఇవాళ నందమూరి కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి మరీ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబం ప్రెస్ మీట్ పై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి మండిపడ్డారు.

బాలయ్య అమాయకుడని, నందమూరి ఫ్యామిలో ట్రాప్ లో పడుతున్నాడని వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు.
గతంలో వైశ్రాయ్ ఘటనలో నాన్న ఎన్టీఆర్ పై చెప్పులేయించినప్పుడు వీళ్లంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలుగువాడు, తెలుగుజాతి అంటే ఎన్టీఆర్ పేరు గుర్తుకొస్తుందని, మీరెంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో ఆలోచించండని కోరారు. మన కుటుంబానికి నేను చెప్పే మాటలు వినండని కోరారు. ఎన్టీఆర్ చనిపోయాక చంద్రబాబు ఫోన్ చేసి విదేశాలకు వెళ్లిపోతే ఎంతో డబ్బులు ఇస్తానన్నారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు. కావాలంటే చంద్రబాబుకు ఫోన్ చేసి అడగాలని బాలయ్యకు సూచించారు.

ysrcp leader lakshmi parvathi slams nandamuri family reaction over humiliation to chandrababu

ఎన్టీఆర్ ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్ చావుకు కారణం చంద్రబాబేనన్నారు. ఎన్టీఆర్ గతంలో చంద్రబాబు తన దుస్ధితికి కారణమని చెప్పిన విషయం మీకు గుర్తులేదా అని బాలకృష్ణను ప్రశ్నించారు. ఆ రోజు మీరు తండ్రికి అండగా నిలవలేదని ఆక్షేపించారు. ఎన్టీఆర్ బాధల్ని ఆయన కుటుంబం ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి మిమ్మల్ని మోసం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
నేనే తప్పు చేయలేదు. నిరూపించమని చంద్రబాబును వ్యతిరేకించి పోరాడానన్నారు. లక్షల కోట్లు ఇస్తామన్నా వినకుండా పోరాడుతూనే ఉన్నానని లక్ష్మీపార్వతి తెలిపారు.

ఇంట్లో నుంచి నన్ను పంపేసినా నేను ఎన్టీఆర్ సిద్ధాంతాలకు అనుగుణంగా బతుకుతున్నానని లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ కోసం మీరు ఏం త్యాగం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు మాట విని భువనేశ్వరిని తిట్టారని అనుకుంటున్నారు. నిజాలు తెలుసుకోండని నందమూరి ఫ్యామిలీని కోరారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం మీ చెల్లెలిని బజారులో పెట్టాడన్న వాస్తవం అర్ధం చేసుకోవాలని బీజేపీ నేత పురంధేశ్వరికి లక్ష్మీపార్వతి లక్ష్మీపార్వతి సూచించారు. మీరు కావాలంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వీడియో తెప్పించుకుని చూడాలని సలహా ఇచ్చారు.

రెండున్నరేళ్లుగా చంద్రబాబు ఎన్నో నాటకాలు ఆడారని, వైసీపీ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లి స్టేలు తెస్తున్నాడని, ఎనిమిదిసార్లు గెల్చిన కుప్పంలో కూడా ఓడిపోయాడో అర్ధం కావడం లేదా అని పురంధేశ్వరిని కోరారు. భువనేశ్వరిని ఎవరైనా వ్యక్తిగతంగా తిడితే తాను ఎంతో బాధపడతానని లక్ష్మీపార్వతి తెలిపారు. గతంలో రెండుసార్లు మీరు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు బాలకృష్ణను ఎవరు కాపాడారో తెలుసుకోవాలని పురంధేశ్వరిని కోరారు.

English summary
ysrcp leader lakshmi parvathi on today slams nandamuri family reaction over humiliation to chandrababu yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X