జనసేన తో మజ్జీ శ్రీను మంత్రాంగం - అక్కడే బిగ్ ట్విస్ట్...!?

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తి కరంగా మారింది. కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. విజయనగరం కేంద్రంగా వైసీపీ ముఖ్య నేత తీరు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. పార్టీలో కీలక పదవులు నిర్వహించిన మజ్జి శ్రీను జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. బల ప్రదర్శనకు సిద్దమయ్యారని సమాచారం. అయితే, తాజా గా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఏం జరుగుతుందనే ఆసక్తి మొదలైంది.

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పని చేసిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను రాజకీయ అడుగులపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీలో చిన్న శ్రీనుకు భీమిలి సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు. కాగా.. స్థానిక ఎన్నికల్లో తన కుమార్తెను బరిలోకి దించి.. విజయనగరం మేయర్ పీఠం పైన కూర్చోబెట్టాలనే లక్ష్యంతో కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

YSRCP Leader Majji Srinu in Touch with Jana Sena Leaders Plans to Project Daughter in Upcoming Local Body Elections

వైసీపీ లో పలు అవకాశాలు రాజకీయంగా దక్కినా.. అవకాశాలు కల్పించినప్పటికీ కేవలం కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్పు దిశగా ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఇందు కోసం సెప్టెంబర్ 5న తన పుట్టినరోజు వేదికగా బలప్రదర్శనకు సిద్దం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. బొత్సా మద్దతుతో రాజకీయంగా జిల్లాలో మజ్జి శ్రీను కీలకంగా ఎదిగారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ద్వారా తన ఉనికిని నిలబెట్టుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

 స్థానిక ఎన్నికలు వరుసగా ఇలా, సీట్లు..పోటీ పై కొత్త ఫార్ములా - చంద్రబాబు నిర్దేశం..!!
స్థానిక ఎన్నికలు వరుసగా ఇలా, సీట్లు..పోటీ పై కొత్త ఫార్ములా - చంద్రబాబు నిర్దేశం..!!

మారుతున్న సమీకరణాలు

కాగా, వైసీపీలో మజ్జి శ్రీను అధిక ప్రాధాన్యత లభించింది. జిల్లా అధ్యక్ష పదవితో పాటుగా జెడ్పీ ఛైర్మన్ పదవి.. అదే విధంగా కీలకమైన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. అయినప్పటికీ..తన కుమార్తె సిరి సహస్రను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన తో ఉన్న మజ్జి శ్రీను విజయనగరం మేయర్​ స్థానాన్ని ఆమెకు దక్కేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్న ట్లు గా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.

కేవలం తన కుమార్తె భవితవ్యం కోసమే అధికార పక్షం వైపు చూడక తప్పడం లేదనే చర్చ వినిపిస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ తో అంతర్గతంగా చర్చలు చేసినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. అయితే.. కొంత కాలంగా బొత్సా జనసేనలో చేరుతున్నారనే ప్రచారమూ వినిపించింది. దీనిని బొత్సా ఖండించారు. అయితే, మజ్జి శ్రీను ఈ ప్రయత్నాల్లో ఉన్నట్లు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

శబరి సహా 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు: బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- రూట్, షెడ్యూల్..!!
శబరి సహా 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు: బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- రూట్, షెడ్యూల్..!!

కాగా.. బొత్సా బలం తన బలంగా చూపించుకునే ప్రయత్నాల్లో మజ్జి శ్రీను ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ కేడర్ సైతం తనతో నే ఉంటుందని చెప్పుకుంటున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఈ క్రమం లోనే సెప్టెంబర్ 5న తన పుట్టినరోజు వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు మజ్జి శ్రీనివాసరావు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కటౌట్లు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తలను, స్థానిక ప్రజాప్రతినిధులను ఒకే వేదికపైకి రప్పించి బొత్స బలాన్ని తన బలంగా ప్రొజెక్ట్​ చేసే పనిలో పడ్డారని వైసీపీలో చర్చ సాగుతోంది. కుమార్తె కు మేయర్​ పదవి కోసమే మజ్జి శ్రీనివాసరావు జనసేన వైపు అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, బొత్సా మద్దతు లేకుండా మజ్జి శ్రీను రాజకీయంగా మనుగడ సాధ్యమా అనే చర్చ మొదలైంది. దీంతో.. రేపు (సెప్టెంబర్ 5) న చోటు చేసుకునే పరిణామాల పై ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+