''నన్ను ఓడించేందుకు ప్రయత్నించారు'', ''నా వ్యాపారాలేమిటో తెలియవా''?
నాతో కలిసిపనిచేసే సమయంలో గౌతంరెడ్డికి నా వ్యాపారాల గురించి తెలియదా మల్లాది విష్ణు ప్రశ్నించారు.రంగాను విమర్శించే స్థాయి గౌతంరెడ్డికి లేదన్నారు మల్లాది విష్ణు.
విజయవాడ: నాతో కలిసి పనిచేసే సమయంలో నా వ్యాపారాలేమిటో గౌతంరెడ్డికి తెలియవా అని గౌతంరెడ్డి ప్రశ్నించారు వైసీపీ నేత మల్లాది విష్ణు.వైసీపీ నేత గౌతంరెడ్డి వ్యాఖ్యలు విజయవాడలో కలకలాన్ని రేపాయి. వైసీపీలోనే కాదు విజయవాడ నగరంలోనే ఈ వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఒకే పార్టీలో ఆధిపత్యం కోసం సాగుతున్న ప్రఛ్చన్నయుద్దం బట్టబయలైందని రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు.
వైసీపీ నేత గౌతంరెడ్డి వంగవీటి రాధా, వంగవీటి రంగాలపై చేసిన వ్యాఖ్యలు విజయవాడలో ఉద్రిక్తతలకు కారణమయ్యాయి.ఓ టీవి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపాయి.
అంతేకాదు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో విజయవాడలో రంగా అభిమానులు ఆందోళనకు దిగారు.
గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించేందుకు ప్రయత్నించిన వంగవీటి రాధా, ఆయన తల్లి రత్నకుమారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది.

రంగాకు గౌతంరెడ్డి సమకాలీనుడు కాదు
వంగవీటి రాధాకు గౌతంరెడ్డి సమకాలీనుడు కాదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. రంగాను విమర్శించేస్థాయి గౌతంరెడ్డికి లేదన్నారు. తాను చేసే వ్యాపారాలేంటో విజయవాడలో అందరికీ తెలుసని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు.

నా గురించి గౌతంరెడ్డికి తెలియదా?
2009 ఎన్నికల్లో తనతోపాటు కలిసి పని చేసిన గౌతమ్ రెడ్డికి తన వ్యాపారాలేంటో తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యల ప్రభావం వైఎస్సార్సీపీపై పడదని ఆయన చెప్పారు. కాపులకు వైఎస్సార్సీపీపై విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. కాపులకు న్యాయం చేసేది వైఎస్సార్సీపీయేనని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలు సరైనవి కాదనే పార్టీ అతనిపై చర్యలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు.

నన్ను ఓడించేందుకు ప్రయత్నించారు
గత ఎన్నికల్లో తాను పోటీచేసిన స్థానంలో ఓడించేందుకు పార్టీలోని కొందరు ప్రయత్నించారని గౌతంరెడ్డి పరోక్షంగా వంగవీటి రాధా పైవ్యాఖ్యలు చేశారు. ఓ టీవి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. రంగా మిత్రమండలి పేరుతో పోటీకి నిలిపారని ఆయన చెప్పారు. అయితే ఈ పోటీ విషయంలో తమకు సంబంధం లేదని ప్రకటించారని గౌతంరెడ్డి చెప్పారు.

రాధా, గౌతంరెడ్డి ఇళ్ళ వద్ద భద్రత
వంగవీటి రాధా, గౌతంరెడ్డి ఇళ్ళ వద్ద పోలీసు భద్రతను ఏర్పాటుచేశారు. రెండు రోజులుగా విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది.ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రాధా, గౌతంరెడ్డి ఇళ్ళ వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. వైసీపీ నుండి గౌతంరెడ్డిపై సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు పార్టీ ఆదేశించింది. మరోవైపు వంగవీటి రంగాపై గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని వైసీపీ ప్రకటించింది. ఈ వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వైసీపీ ముందుజాగ్రత్త చర్యలను తీసుకొంది.












Click it and Unblock the Notifications