నిజమేనా! "తీవ్ర అవినీతిలో కూరుకుపోతున్న బాలకృష్ణ పీఏ"
అనంతపురం : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై విమర్శలు గుప్పించారు వైసీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్. నియోజకవర్గానికి ఏమాత్రం అందుబాటులో ఉండని బాలకృష్ణ.. మూడు నెలల్లో ఒక రోజు మాత్రమే హిందూపురంలో పర్యటిస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే పదవిని బాలకృష్ణ సినిమా షూటింగ్ లా భావిస్తున్నారంటూ విమర్శించారు నవీన్ నిశ్చల్. నియోజకవర్గ ప్రజల కష్టాలను బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాలకృష్ణకు పీఏగా వ్యవహరిస్తోన్న వ్యక్తి హిందూపురంలో భారీ అవినీతికి పాల్పడుతున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారాయన.

ఇదిలా ఉంటే.. శనివారం నాడు నియోజకవర్గంలో పలు అభివ్రుద్ది పనులకు ఎమ్మెల్యే బాలకృష్ణ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. పట్టణంలోని పాండురంగనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మున్సిపల్ పార్క్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం కెరికెర బసవనపల్లిలోని ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.39లక్షలతో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications