సర్కార్ విఫలమైన చోటల్లా జగన్ ..! అమ్మఒడి లోకేష్ కనిపెట్టారా ? పేర్ని నాని కామెంట్స్..!

రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వరుస పర్యటనలు చర్చనీయాంశమవుతున్న వేళ ప్రభుత్వం వాటికి ఎక్కడిక్కడ అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై వైసీపీ నేతలు ఇప్పటికే మండిపడుతున్నారు. తాజాగా జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ విఫలమైతే అక్కడ బాధితులకు జగన్ అండగా నిలుస్తున్నారని పేర్ని తెలిపారు.

వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌తోనే రాష్ట్రంలో రైతుల‌కు న్యాయం జరుగుతోందని పేర్ని తెలిపారు. - జ‌గ‌న్ వెళ్లి మాట్లాడాకే రైతుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వంలో క‌ద‌లిక‌ వచ్చిందన్నారు. మిర్చి, పొగాకు, మామిడి పంట‌ల కొనుగోళ్ల‌లో జరిగింది ఇదేనన్నారు.
వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని తెలిసి ముందురోజు హ‌డావుడిగా కొనుగోళ్లు చేశారని గుర్తుచేశారు. స‌బ్సిడీ ధ‌రకు మామిడి కొనుగోళ్ల‌కు జీవో ఎప్పుడిస్తారని పేర్ని ప్రశ్నించారు. రూ.260 కోట్ల‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.
స‌బ్సిడీ ధ‌ర‌కు తోతాపురి మామిడి కొనుగోళ్లు అన్ని ప్రాంతాలకు అమలు చేయాలన్నారు.

ysrcp leader perni nani says ys jagan at where chandrababu fails questions cm s silence on these

మామిడి కొనుగోళ్ల‌పై సీఎం చంద్రబాబు, మంత్రులు ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పారని పేర్ని నాని ఆరోపించారు. 80 శాతం, 90 శాతం కొన్న‌ట్టు ఒక్కొక్క‌రూ ఒక్కో విధంగా స్టేట్మెంట్‌ ఇచ్చారన్నారు. 67 శాత‌మే కొనుగోలు చేశామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ వాస్త‌వం చెప్పారని పేర్ని తెలిపారు. రైతుల నుంచి ఎక్క‌డా కేజీ రూ.8ల‌కు కొనుగోలు చేసిందే లేదన్నారు. ప్ర‌భుత్వం రూ.4ల స‌బ్సిడీ ఇచ్చిన‌ట్టు చెప్ప‌డం కూడా అబ‌ద్ద‌మే అన్నారు.

ysrcp leader perni nani says ys jagan at where chandrababu fails questions cm s silence on these

మరోవైపు అమ్మ ఒడిని త‌ల్లికి వందనంగా మార్చేసి ల‌బ్ధిదారుల‌ను తీవ్రంగా వంచించిందే కాకుండా ఆ ప‌థ‌కాన్ని లోకేష్ క‌నిపెట్టాడ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం విచిత్రంగా ఉందని పేర్ని తెలిపారు. కొడుకు త‌ప్పు చేస్తే తండ్రి దండించాల్సిందిబోయి తండ్రే బ‌రితెగించి అబ‌ద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. జ‌నం న‌వ్వుతార‌నే క‌నీస ఆలోచ‌న లేదన్నారు. ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫ‌ర్ శివ‌కుమార్‌ను ఎవ‌రో కొట్టార‌ని సీఎం చంద్ర‌బాబు హెలిక్యాప్ట‌ర్ లో నుంచి ఫోన్ చేసి మాట్లాడిన‌ట్టు ఆ పార్టీ ఎక్స్‌లో పోస్టు చేసిందని, మ‌రి నిన్న కాకినాడ‌లోని రంగ‌రాయ మెడిక‌ల క‌ళాశాల‌లో కీచ‌కులు విద్యార్థినుల‌ను చెర‌బ‌డితే చంద్ర‌బాబు వారిని ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేదని పేర్ని ప్రశ్నించారు. ఏడాదిగా రాష్ట్రంలో మ‌హిళ‌ల మీద ఎన్నో దారుణాలు జ‌రిగితే ఏ ఒక్క సంఘ‌ట‌న‌లోనూ బాధితుల‌కు చంద్ర‌బాబు ఫోన్ చేసి నేనున్నాన‌ని ధైర్యం చెప్పింది లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+