సర్పంచ్‌గా గెలవనోడు మంత్రి అవుతాడా?- నారా లోకేష్‌పై పవన్ ఫైర్: తవ్వి తీసిన పోసాని
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ చలనచిత్రాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్‌పై ఘాటు విమర్శలు సంధించారు. నారా లోకేష్ వేసిన పరువునష్టం దావా కేసుకు సంబంధించిన కీలక వివరాలను బయటపెట్టారు.
కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరులతో మాట్లాడారు. పరువు నష్టం దావా వ్యవహారంలో తనను మంగళగిరికి పిలిపించుకుని, కోర్టు చుట్టూ తిప్పాలనేది ఈ మాజీ మంత్రి నారా లోకేష్ ఉద్దేశమని, దీనికోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డాడని పోసాని కృష్ణమురళి ధ్వజమెత్తారు. రాజకీయంగా కక్ష సాధించడానికి ఎంతటి ఘాతుకానికైనా దిగొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తనను హత్య చేయడానికి కుట్ర పన్నాడని, దీని కోసం తెరవెనుక ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయని పోసాని ఆరోపించారు. మంగళగిరిలో కోర్టు చుట్టూ తిప్పించే క్రమంలో తనను హత్య చేయడానికి కుట్ర పన్నాడని విమర్శించారు. నారా లోకేష్ కొంతమంది విదేశీ అమ్మాయిలతో చెట్టాపట్టాలేసుకుని అర్ధనగ్నంగా తిరగడానికి సంబంధించిన ఫొటోలను బయటపెట్టాననే కక్షతో రగిలిపోతున్నాడని అన్నారు.
అలాంటి ఫొటోలను బయటికి రావడం వల్ల తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని నారా లోకేష్ భయపడుతున్నాడని, అందుకే తనను మట్టుపెట్టాలని కుట్ర పన్నాడని పోసాని అన్నారు. దీనికి సంబంధించిన పక్కా సమాచారం తన వద్ద ఉందని వివరించారు. తన మరణించానంటే దానికి కారణం నారా లోకేషేనని స్పష్టం చేశారు.
నారా లోకేష్ అంటే చాలామంది ఉంటారు. ఎవరో అనుకోవద్దు. చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త.. అతనే నా చావుకు కారణమౌతాడు.. అని పోసాని తేల్చి చెప్పారు. నారా లోకేష్ కంటే ఎంతో విశ్వసనీయత ఉన్న నాయకుడినని, అమ్ముడుపోయే వాడిని కాదని పోసాని అన్నారు.
గతంలో పవన్ కల్యాణ్.. నారా లోకేష్‌పై చేసిన విమర్శలకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను పోసాని కృష్ణమురళి ప్రదర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలవనోడు పంచాయతీ రాజ్ శాఖకు మంత్రి అవుతాడా? అంటూ 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శల వీడియో అది. నారా లోకేష్ 1,000 కోట్ల రూపాయలకు కుంభకోణానికి పాల్పడ్డాడని పోసాని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications