కాటసాని, శిల్పాలు ఎటువైపు, నెరవేరని విజయమ్మ హమీ, మల్కిరెడ్డి అసంతృప్తి?
నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ అనివార్యంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ఈ ఎన్నికల్లో
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ అనివార్యంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ఈ ఎన్నికల్లో బరిలోకి దింపనున్నట్టు ప్రకటించాయి. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని టిడిపి నాయకత్వం చేసిన ప్రయత్నాలు సత్పలితాలు ఇవ్వలేదు.మరో వైపు బంధుత్వాలు, పార్టీల మధ్య నేతలు నలిగిపోయే పరిస్థితిని కల్పించింది ఈ ఉపఎన్నిక. అయితే ఎన్నికలు పూర్తయ్యేనాటికి ఇంకా ఎన్ని వింతలు చోటుచేసుకొంటాయో చూడాలి.
ఈ ఏడాది మార్చి 21వ, తేదిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు. దీంతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ స్థానం నుండి పోటీచేసిన రెండు కుటుంబాలు వేర్వేరు పార్టీల తరపున పోటీచేస్తున్నారు.
2014 ఎన్నికల సమయంలో ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి పోటీచేసి విజయం సాధించారు. టిడిపి తరపున మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పోటీచేసి స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. అయితే ఏడాదిన్నర క్రితం వైసీపీని వీడి భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు భూమా అఖిలప్రియ టిడిపిలో చేరారు.
అయితే టిక్కెట్టు కేటాయింపు విషయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడారు. ఈ నెల 14వ, తేదిన ఆయన టిడిపిని వీడి వైసీపీలో చేరారు. ఈ నెల 25న, శిల్పాకే టిక్కెట్టును కేటాయిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది.

వైఎస్ విజయమ్మ ప్రయత్నాలు విఫలం
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా జరిగేలా వైఎస్ జగన్ ను కలిసి విన్నవిస్తే తమకు అభ్యంతరాలు లేవని వైసీపీ నాయకులు ప్రకటించారు.ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబసభ్యులు అత్యంత ఆప్తుల ద్వారా వైఎస్ విజయమ్మ వద్దకు ఏకగ్రీవ ప్రతిపాదనలను పంపారని చెప్పారు. వైసీపీ నుండి పోటీ లేకుండా సహకరిస్తానని ఆమె హమీ ఇచ్చారని ప్రచారం ఉంది. అయితే వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి పేరును ఆదివారంనాడు ప్రకటించడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.

బంధుత్వాలు ఒకవైపు, పార్టీలు మరోవైపు
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికల విషయంలో శిల్పా చక్రపాణిరెడ్డి, బనగానిపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డిలది విచిత్ర పరిస్థితి.నంద్యాల అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా బరిలో ఉంటున్న భూమా బ్రహ్మనందరెడ్డి కాటసాని రాంరెడ్డికి స్వయానా అల్లుడు.కాటసాని రాంరెడ్డి వైసీపీలో ఉన్నారు. భూమా బ్రహ్మనందరెడ్డి టిడిపిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా ఇటీవలనే ఎన్నికైన శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపిలో ఉన్నారు. ఆయన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడి ఇటీవలే వైసీపీలో చేరారు. అయితే శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ నిర్ణయానికి అనుకూలంగా తన సోదరుడు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా అనే చర్చ సాగుతోంది. అయితే కాటసాని రాంరెడ్డి పార్టీ నిర్ణయానికి అనుకూలంగా తన అల్లుడు టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా అనేది సమస్య.

ఆ రెండు కుటుంబాల మధ్యే సమరం
2014 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి భూమా కుటుంబం, శిల్పా కుటుంబాల మధ్యే పోటీ జరిగింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి భూమా నాగిరెడ్డి వైసీపీ నుండి పోటీచేశారు. టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి పోటీచేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ స్థానం నుండి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాలకు చెందినవారే పోటీచేయనున్నారు. భూమా కుటుంబం నుండి భూమా బ్రహ్మనందరెడ్డి, శిల్పా కుటుంబం నుండి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.

అసంతృప్తితో రాజగోపాల్ రెడ్డి?
ఉప ఎన్నికల్లో టిక్కెట్టు ఇస్తానని వైసీపీ అధినేత జగన్ మాట తప్పారని నంద్యాల వైసీపీ ఇంచార్జీ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఉప ఎన్నికల్లో అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అంటూ ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీలో రాజగోపాల్ రెడ్డి పేరును ప్రకటించారు. 2016 లో జనవరిలో భూమా నాగిరెడ్డి వైసీపీని వీడినా మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైసీపీనీ బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో పాటు, ఆయనకే టిక్కెట్టు కేటాయించడం పట్ల రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే బాధ్యతను జగన్ తీసుకొంటున్నట్టు వైసీపీ సీనీయర్ నాయకులు చెబుతున్నారు. జగన్ మాట ఇచ్చింది నిజమే....ఆయన ఏ నిర్ణయం తీసుకొన్నా కట్టుబడి ఉంటా అంటూ రాజగోపాల్ రెడ్డి తన సన్నిహితులతో అంటున్నారని సమాచారం.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications