175 స్థానాల్లో పర్ఫెక్ట్ టీం, ఇదీ మా లెక్క - అభ్యర్దుల మార్పుపై సజ్జల..!!

వచ్చే ఎన్నికల పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో వైసీపీ ఫర్ ఫెక్ట్ టీమ్‌ను దించుతుందని తేల్చి చెప్పారు. సామాజికవర్గ సమీకరణాలతో, 175 చోట్ల పర్ ఫెక్ట్ టీమ్ ను దించుతున్నామని వెల్లడించారు. చంద్రబాబుకు చేతనైతే ఆ పని చేయమనండని సజ్జల సవాల్ చేసారు. అదే విధంగా ఇంఛార్జ్ ల మార్పు పైన సజ్జల క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.

1.47 కోటి కుటుంబాలకు మేలు : వైసీపీ ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జగన్‌ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. 31 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చామని, నాడు-నేడు కింద స్కూళ్ల రూపు రేఖలు మర్చామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా వినియోగించుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు. ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశారు..చంద్రబాబు ఎవరికి కథలు చెబుతారని సజ్జల మండిపడ్డారు. తుఫాన్ల సమయంలో ఫలానా తక్షణ సాయం చేశానని చంద్రబాబు లెక్కలు చెప్పగలరా అని ప్రశ్నించారు.

YSRCP Leader Sajjala made serious commnets on party incharges change and on coming Elections

సామాజిక సమీకరణాలతోనే : తుఫాన్ విషయంలో 22 లక్షల్లో 10 వేల కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా అంటూ నిలదీసారు. తుపాను పరిహారం విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేకుండా చేశామని చెప్పారు.హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్రానికి గెస్ట్ లా వస్తారని దుయ్యబట్టారు. 2019లోనే చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారని వివరించారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నాడు కాబట్టే చంద్రబాబును జనం తిరస్కరించారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో దుర్గ గుడిలో పూజలు చేసినట్లు ఇప్పుడు కూడా పూజలేమైనా చేస్తున్నారనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
YSRCP Leader Sajjala made serious commnets on party incharges change and on coming Elections

175 చోట్ల పర్ఫెక్ట్ టీంతో : అభ్యర్థులు మార్పు విషయంలో అవాకులు చవాకులు పేలుతున్న చంద్రబాబు...ఆయన కుమారుడు బీసీ సీట్లలో ఎందుకు పోటీ చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క టిక్కెట్ కూడా రాదన్నారు. కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేయిస్తున్నారని ఆరోపించారు. సిటిజన్ ఫోరమ్ పేరుతో ఒక బోగస్ ఫోరమ్‌ను పెట్టారని సజ్జల మండిపడ్డారు. వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యానికి..నిమ్మగడ్డ రమేష్ కు తెలియదా అని ప్రశ్నించారు. సామాజిక సమీకరణాలతోనే 175 నియోజకవర్గాల్లో పర్ఫెక్ట్ టీం ను దించుతున్నామని సజ్జల వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+