పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు... సీజ్ దిస్ ప్రాబ్లమ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన నాటినుండి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేయడానికి వైసిపి నేతలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో అన్నదాతల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతూ ఈరోజు రైతు పోరుబాట అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తున్న క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల టార్గెట్ చేశారు.
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన శ్యామల
పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదన్నారు. గతంలో రైతును రాజును చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ మాటలు గుర్తున్నాయా చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదుకోవాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.

రైతు సంక్షేమం గాలికి
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు పోరుబాట నిర్వహిస్తున్నామని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని ఆమె తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తోందని అయినప్పటికీ రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని పేర్కొన్నారు. ఇక రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఊసే ఎత్తడం లేదని పేర్కొన్న శ్యామల ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తున్నారన్నారు.
పవన్ కళ్యాణ్ కు శ్యామల సెటైర్లు
అకాల వర్షాలతో అన్నదాతలు కంటికి కడివెడు బాధలో ఉన్నారని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయకుండా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్రై టు సీజ్ దిస్ ప్రాబ్లం అంటూ శ్యామల సెటైర్ వేశారు.
సంక్రాంతి వస్తున్నా రైతన్నలలో దిగాలు
త్వరలో సంక్రాంతి పండుగ రాబోతుందని, పండుగ సమయంలో కూడా ఏపీ రైతన్న దిగాలుగా దిక్కు తోచని స్థితిలో పడిపోయారని, అందుకే ఆందోళనలో ఉన్న అన్నదాతకు జగన్ అండగా నిలిచారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని శ్యామల పేర్కొన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ సీజ్ దిస్ ప్రాబ్లమ్ అంటూ శ్యామల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications