ప్రశ్నించినందుకే ఐవైఆర్ ను తప్పించారు: అంబటి రాంబాబు
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావును ఉద్దేశ్యపూర్వకంగానే బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి నుండి తొలగించారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.
గుంటూరు: రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావును ఉద్దేశ్యపూర్వకంగానే బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి నుండి తొలగించారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.
బుదవారం నాడు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మణ సమాజానికే కాదు సభ్యసమాజం బాధపడే విషయమన్నారు అంబటిరాంబాబు. చంద్రబాబుకు ఓటేసిన ప్రతి బ్రహ్మణుడు చెంపలేసుకొంటున్నాడన్నారు.

నీతి, నిజాయితీని కొలమానంగా తీసుకొని ఆయనను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీఐ కమిషనర్ హోదా ఇస్తామని చంద్రబాబు చెబితే బ్రహ్మాణ సామాజికి వర్గానికి సేవ చేసేందుకు బ్రహ్మాణ ఛైర్మెన్ పదవిని తీసుకొన్నారని చెప్పారు.
సిన్సియర్ అధికారిని మీ కార్యకర్తలాగో, పార్టీ నేతలానో వ్యవహరించలేదని పదవి నుండి తొలగించారని ఆయన ఆరోపించారు. జన్మభూమి కమిటీ సభ్యులకు మాత్రమే లబ్దిపొందేలా చూడాలని కృష్ణారావుపై ఒత్తిడి తెచ్చారన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే అధికారి ఐవైఆర్ టిడిపి నేతల ఆదేశాలను తిరస్కరించారని చెప్పారు. బ్రహ్మణ కార్పోరేషన్ లో టిడిపి నేతల జోక్యాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేసినందుకే కక్షగట్టి ఆయనపై వేటేశారని చెప్పారు.
అడిగితే రాజీనామా చేసేవాడినని స్వయంగా ఐవైఆర్ చెప్పడం ఆయనపై ఉన్న ఒత్తిడిని తెలుపుతోందన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణికి రాయితీలు ఎందుకిచ్చారని ప్రశ్నించడమే నేరమైందన్నారు. బాహుబలి-2 సినిమా గొప్ప సినిమానే కానీ, ప్రత్యేక కేటగిరి ఇచ్చి రోజుకు ఆరేడు షోలకు అనుమతి ఇచ్చేందుకు కారణాలు చెప్పాలని అడగడంతో కృష్ణారావుపై కక్ష పెంచుకొన్నారని ఆయన ఆరోపించారు. ఐవైఆర్ కృష్ణారావును అవమానకరరీతిలో తొలగించడాన్ని ఎవరూ కూడ తేలికగా తీసుకోరని చెప్పారు.












Click it and Unblock the Notifications
