Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ చేతికి ఆయుధాలను అందిస్తున్న వైసీపీనేతలు.. వాటితో జగన్ పై లోకేష్ ఎటాక్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ వచ్చే ఎన్నికలలో అధికారం చేజిక్కించుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచిస్తూ ఉంటే, వైసీపీ ఎమ్మెల్యేల తీరు ప్రతిపక్ష పార్టీ నేతలకు ఆయుధాన్ని ఇస్తున్నట్లుగా తయారయింది.

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల తీరుతో జగన్ కు తలనొప్పి

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల తీరుతో జగన్ కు తలనొప్పి

జగన్ పై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతున్నట్టుగా వారు జగన్ పాలన పైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. వైసిపి లో నిన్నటి వరకు జగన్ మాటే మా మాట అన్నట్టు చెప్పుకొచ్చిన నేతలంతా ఒక్కొక్కరుగా నిరసన గళాన్ని వినిపిస్తున్నారు . నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో పనులు కావడం లేదని అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు. శాఖలు మారుతున్నాయి.. కలెక్టర్లు మారుతున్నారు కాని పనులు మాత్రం కావడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్యేల నిరసన గళం

ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్యేల నిరసన గళం

ఇక తాజాగా ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశామని ఓట్లు అడుగుదామని ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. రోడ్ల గుంతలు పూడ్చలేక పోయామని, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని, నాలుగేళ్లలో ఏం చేశామని ప్రజలను ఓట్లు అడుగుతాము అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సైతం ఉపాధ్యాయులు ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారని, తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే అవకాశం కూడా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

టీడీపీకి ఆయుధంగా మారిన వైసీపీ ఎమ్మెల్యేల షాకింగ్ వ్యాఖ్యలు

టీడీపీకి ఆయుధంగా మారిన వైసీపీ ఎమ్మెల్యేల షాకింగ్ వ్యాఖ్యలు

ఇలా వరుసగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరుపై, జగన్ పాలన పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో అది టిడిపికి ఆయుధంగా మారుతుంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పై మండిపడిన నారా లోకేష్ టిడిపి, జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. అరెస్టు చేసిన ప్రతిపక్ష పార్టీల నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వైసీపీ నాయకులే జగన్ ను అడ్డుకుంటారు.. లోకేష్

వైసీపీ నాయకులే జగన్ ను అడ్డుకుంటారు.. లోకేష్

ఇదే సమయంలో వైఎస్ జగన్ ను అడ్డుకోవాల్సిన అవసరం తమకు ఏ కోశాన లేదని చెప్పిన నారా లోకేష్ చెత్త పాలన, అసమర్థ ముఖ్యమంత్రి అంటూ వైసిపి కి చెందిన సొంత సామాజికవర్గ నేతలు ముఖ్యమంత్రి పై తిరుగుబాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఇతర పార్టీల నేతల అరెస్టులను మానుకొని, సీఎం పర్యటన ఉన్న సమయంలో వైసిపి నేతలను అరెస్టు చేయాలని తాను పోలీసులను ప్రత్యేకంగా కోరుతున్నానని నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎందుకంటే చెత్త పరిపాలనపై ఒళ్ళు మండిన వైసిపి నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనను అడ్డుకుని నిలదీసే అవకాశం ఉందని నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వైసీపీలో చర్చనీయాంశంగా మారిన నేతల తీరు

వైసీపీలో చర్చనీయాంశంగా మారిన నేతల తీరు

మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల తీరు ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. సొంతపార్టీ పైన, ప్రభుత్వ పాలన పైన వారు చేస్తున్న వ్యాఖ్యలతోనే లోకేష్ జగన్ పాలనను టార్గెట్ చేశారు. మొత్తంగా చూస్తే ఇప్పటికే ఏ చిన్న అవకాశం దొరికినా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే ఆయుధాలను అందిస్తున్న తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+